Dream: కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తున్నారా.? దీని అర్థం ఏంటంటే..

|

Jul 04, 2024 | 4:25 PM

ఇక సైన్స్‌ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు మరింత మరింత చురుకుగా పని చేస్తుంది. రాత్రుళ్లు కలలు రావడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. ఇక కలలో వచ్చే ప్రతీ అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి రాత్రి పడుకున్న సమయంలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తే దేనికి సంకేతం.? దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తున్నారా.? దీని అర్థం ఏంటంటే..
Dream
Follow us on

రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సాధారణ విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కలలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మనకు జరగబోయే విషయాలకు సంబంధించి సూచనలు అందిస్తుంటాయని స్వప్న శాస్త్రంలో కూడా వివరించారు.

ఇక సైన్స్‌ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు మరింత మరింత చురుకుగా పని చేస్తుంది. రాత్రుళ్లు కలలు రావడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు. ఇక కలలో వచ్చే ప్రతీ అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి రాత్రి పడుకున్న సమయంలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తే దేనికి సంకేతం.? దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చనిపోయిన తల్లీ లేదా తండ్రి కలలో కనిపిస్తే వారి ఏదో కోరిక ఉందని అర్థం చేసుకోవాలి. వారికి చివరి కోరిక ఏదైనా తీరక పోయినా ఇలా కనిపిస్తుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కలలో వాళ్లు కనిపించిన ఒక్కో విధానానికి ఒక్కో అర్థం ఉంటుందని పండితులు అంటున్నారు. ఒకవేళ కలలో తల్లిదండ్రులు ఏడుస్తున్న కల వస్తే అశుభంగా భావించాలని చెబుతున్నారు. భవష్యత్తులో ఏదో అశుభవార్త వినే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి కలలు వస్తే పండితులతో పిండాలు పెట్టడం లాంటివి చేయాలని చెబుతున్నారు.

ఇకవేళ చనిపోయిన పేరెంట్స్‌ కలలో నవ్వుతున్నట్లు, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే అది మంచి సూచనగా భావించాలి. మీ పేరెంట్స్‌ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం చేసుకోవాలి. మీ ఎదుగుదల పట్ల వాళ్లు హ్యాపీగా ఉన్నారని, వచ్చే రోజుల్లో మీకు ఏదో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. జీవితంలో పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయని భావించాలి. ఇక చనిపోయిన తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నట్లు కల వస్తే మంచిగానే భావించాలి. ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..