Viral Video: తనకంటే పిల్లల్ని శ్రద్దగా చూస్తుందని భార్యతో 20 ఏళ్లుగా మాట్లాడని భర్త.. ఎక్కడంటే..

|

Dec 16, 2023 | 7:19 PM

జపాన్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దక్షిణ జపాన్‌కు చెందిన ఒటౌ కటాయామా తన భార్య యుమీ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఒటౌకి 20 ఏళ్ల క్రితం తన భార్య యుమీపై కోపం వచ్చింది. అప్పటి నుంచి అంటే గత 20 సంవత్సరాలుగా తన భార్యతో మాట్లాడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓటౌ తన పిల్లలతో మాట్లాడతాడు .. తన భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడడు. భర్త ఇన్ని ఏళ్లు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడంటే.. ఆ భార్య ఎంత కోపం తెప్పించే పని చేసిందో అని ఎవరైనా ఆలోచిస్తే .. అది తప్పే..  ఎందుకంటే అది ఎవరికైనా సిల్లీ రీజన్ అనిపిస్తుంది కనుక

Viral Video: తనకంటే పిల్లల్ని శ్రద్దగా చూస్తుందని భార్యతో 20 ఏళ్లుగా మాట్లాడని భర్త.. ఎక్కడంటే..
Japanese Couple
Follow us on

ఇంటి కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాతావరణం చెడిపోతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు హద్దులు దాటితే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఏదైనా సమస్య ఏర్పడి లేదా భార్య మీద కోపంతోనో భర్తతో మాట్లాడటం మానేస్తే.. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రతి భార్యకు తెలుసు. తనతో మాట్లాడని భర్తతో మాటలు కలపడం ఏదైనా కావాల్సి వస్తే అడగం ఆ ఇంటి మహిళకు అత్యంత కష్టమైన పని అవుతుంది. పురుషులు కొద్దిగా కోపంగా..  మొండి తనం కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం మగవారి స్వభావం. అయితే ఈ కోపం కొంత సమయం తర్వాత తగ్గి మళ్ళీ నార్మల్ గా మాట్లాడేస్తారు. అయితే ఓ భర్తకు కోపం వచ్చి.. తన భార్యతో ఒకటి ఏడాది కాదు రెండేళ్లు కాదు ఏకంగా 20 ఏళ్లుగా మాట్లాడకుండా ఉన్నాడు. మరి ఆ భర్తకు 20 ఏళ్లు సైలెంట్ గా ఉండేటంత కోపం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నారా.. ఇది సినిమా లో జరిగిన సంఘటన కాదు.. నిజ జీవితంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

జపాన్ లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. దక్షిణ జపాన్‌కు చెందిన ఒటౌ కటాయామా తన భార్య యుమీ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఒటౌకి 20 ఏళ్ల క్రితం తన భార్య యుమీపై కోపం వచ్చింది. అప్పటి నుంచి అంటే గత 20 సంవత్సరాలుగా తన భార్యతో మాట్లాడటం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓటౌ తన పిల్లలతో మాట్లాడతాడు .. తన భార్యతో ఒక్క మాట కూడా మాట్లాడడు. భర్త ఇన్ని ఏళ్లు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడంటే.. ఆ భార్య ఎంత కోపం తెప్పించే పని చేసిందో అని ఎవరైనా ఆలోచిస్తే .. అది తప్పే..  ఎందుకంటే అది ఎవరికైనా సిల్లీ రీజన్ అనిపిస్తుంది కనుక

ఇవి కూడా చదవండి

ఇంత సుదీర్ఘ మౌనానికి కారణం ఏమిటంటే..

ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఓటౌ తన మౌనానికి కారణాన్ని వెల్లడిస్తూ.. తన  భార్య యుమీ పిల్లలపై చూపుతున్న శ్రద్ధ చూసి తనకు అసూయ కలిగిందని.. ఇంకా చెప్పాలంటే తనకంటే తన పిల్లలని ప్రేమిస్తుందని అందుకే తన భార్యతో మాట్లాడటం మానేసినట్లు చెప్పాడు. ఓటౌ 18 ఏళ్ల కుమారుడు యోషికి తన తల్లిదండ్రులు మాట్లాడుకోవాలని చేసేందుకు ఓ టీవీ షో సహాయం తీసుకున్నాడు. అప్పుడు ఈ విషయం ఇది తెరపైకి వచ్చింది. యోషికి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. మా నాన్న చివరిసారిగా మా అమ్మతో మాట్లాడిన సందర్భం తనకు గుర్తు లేదని చెప్పాడు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

అమ్మ నాన్నతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా సైగలతోనే స్పందించేవారని 21 ఏళ్ల యోషికి  చెప్పాడు. ఎవరైనా ఇది చూస్తే.. భర్త భర్తల సంభాషణ ఏకపక్షంగా సాగిందనిపిస్తుందన్నాడు. 25 ఏళ్ల కూతురికి కూడా తన తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఎప్పుడు మాట్లాడుకున్నారో గుర్తులేదని చెప్పింది. ఈ మౌన పోరాటం ఎంతకాలం కొనసాగుతుందనే విషయంలో ఎలాంటి గ్యారంటీ లేదు కానీ భర్త ఓటౌ తన కోపానికి ఇక గుడ్ బై చెప్పాలని ఛానెల్ సిబ్బంది కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..