సాధారణంగా చాలా మంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. బాత్‌రూమ్‌లో స్నానం చేసేటప్పుడు పాటలు వింటూనో, పాడుతూనే ఉంటారు. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్‌రూమ్‌లో పాటలు వినడమే పాపం అయ్యింది. చివరకు ఆ అంశం క్షమాపణలు చెప్పేవరకు వెళ్లింది. ఏకంగా క్షమాపణల లేఖ రాసి, దానిని పట్టుకుని నిల్చుంది. ఇందుకు సంబంధించిన లేఖ, అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేరళలలోని కూవపల్లిలో అమల్ జ్యోతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థిని.. హాస్టల్‌లో ఉంటోంది. అయితే, స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో వెంట మొబైల్ ఫోన్‌ను కూడా తీసుకెళ్లింది. పాటలు వింటూ యువతి స్నానం చేసింది. ఆమె అలా చేయడమే ఇక్కడ నేరమైంది. హాస్టల్ సిబ్బంది ఆమె మొబైల్‌ను లాక్కోవడమే కాకుండా, క్షమాపణలు కోరుతూ లేఖను కూడా రాయించారు.
‘‘బాత్రూమ్‌లో మొబైల్‌లో పాటలు వింటూ స్నానం చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. నేను పూర్తిచేయాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దయచేసి నా మొబైల్‌ను నాకు తిరిగి ఇవ్వండి’’ అని యువతి తన క్షమాపణ లేఖలో హాస్టల్ వార్డెన్‌ను కోరింది.
అయితే, యువతి క్షమాపణ లేఖ రాయడంతో పాటు.. ఆ లేఖ పట్టుకుని నిల్చోగా ఫోటో కూడా తీశారు. ఈ ఫోటో, లేఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది 2022లో చోటు చేసుకున్న ఘటన కాగా, ఇప్పుడు తాజాగా వైరల్ అవుతోంది. ఈ లేఖను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. హాస్టల్‌లో ఇంతటి కఠిన ఆంక్షలు సరికాదని తిట్టిపోస్తున్నారు. సంగీతం వినడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది విద్యార్థినిని అవమానించడమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
An apology letter for listening to music – Amal Jyothi College of Engineering
by u/bheemanreghu in Kerala
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..