కార్ల వెనుక భాగంలో Lxi, Zxi, LDi, ZDi అనే అక్షరాలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఆసక్తికర విషయాలు
బైక్‌ల కన్నా కారు ఎంత విలాసవంతమైన ప్రయాణం అంటే అది కారు అని చెప్పాలి. ఎన్ని వందల కిలోమీటర్ల దూరం అయినా కారులో చాలా హాయిగా ప్రయాణం చేవచ్చు. అలసిపోవడం..
బైక్‌ల కన్నా కారు ఎంత విలాసవంతమైన ప్రయాణం అంటే అది కారు అని చెప్పాలి. ఎన్ని వందల కిలోమీటర్ల దూరం అయినా కారులో చాలా హాయిగా ప్రయాణం చేవచ్చు. అలసిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది కార్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ రోజుల్లో సామాన్య ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారు. దగ్గర కారుకు సరిపడే డబ్బు లేకున్న సరే ఈఎంఐ రూపంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ల విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఒకటుంది. అదీ ముఖ్యంగా వాటి వెనుక భాగాల్లో కారు పేరుతోపాటు ఉండే పలు అక్షరాలు. మీరెప్పుడైనా కార్ల వెనుక లేదంటే పక్కన, ముందు భాగాల్లో Lxi, Zxi, LDi, ZDi లాంటి అక్షరాలను మీరు గమనించారా..? గమనించినా.. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ వాటికి అర్థాలు కూడా ఉన్నాయి. మరి వాటి అర్థాలు ఏమిటో తెలుసుకోండి.
Lxi ,LDi అంటే అర్థం ఏంటి?:
L అంటే బేసిక్ మోడల్. ( బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్)
Xi అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
Vxi, VDi అంటే..
ఇందులో V అంటే మీడియం లెవల్. అంటే బేసిక్ కంటే ఎక్కువ.. టాప్ మోడల్ కంటే తక్కువ అని అర్థం.
Xi అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
ZXi, ZDi అంటే :
ఇందులో Z అంటే టాప్ మోడల్ అని అర్థం. (టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను కలిగి ఉన్న వెహికిల్)
Xi అంటే పెట్రోల్ వెహికిల్ అని అర్థం.
D అంటే డీజిల్ వెహికిల్ అని అర్థం
అదే ఫోర్డ్ కార్స్ కు అయితే..
LXi -లోయర్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
ZXi -హై లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
SXi – హై లెవల్ ఫీచర్స్ అండ్ పెట్రోల్
CRDI – ( Common Rail Diesel Injection)
అయితే కొన్ని కార్లకు ఈ అక్షలతో పాటు ABS అని ఉంటుంది. అంటే ఎయిర్ బ్యాక్స్ సిస్టమ్ ఉందని అర్థం.
అయితే ఇలాంటి అక్షరాల పద్ధతిని అన్ని కంపెనీలు పాటించవు. మారుతి కార్లు ఇలా ఉంటాయి. అదే హుండాయ్ వంటి కంపెనీలు వేరే విధంగా కార్ మోడల్స్‌ను తయారు చేస్తాయి. హుండాయ్‌లో కార్ మోడల్స్ era, magna , sports , asta తరహాలో ఉంటాయి. అయితే కొన్ని కారు మోడల్స్ Zxi + అని + సింబల్ వచ్చేలా ఉంటాయి. అంటే ఆ మోడల్‌లో టాప్ కారని అర్థం. ఈ క్రమంలో బేసిక్, మీడియం, టాప్ మోడల్ కార్లలో ఉండే ఫీచర్లు కూడా మారుతాయి. టాప్ మోడల్ కార్లలో అన్ని ఫీచర్లు ఉంటే అందులో కొన్ని ఫీచర్లు మీడియం, బేసిక్ మోడల్స్‌లో తగ్గుతాయి.
(నోట్: ఇందులోని అంశాలు వివిధ వెబ్‌సైట్లు, నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందించడం జరిగింది.)
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి