‘ప్రేమ’ మాటలకందని మధరానుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ ఉద్వేగం. అలాంటి ప్రేమ ఎప్పుడు ఎవరిపై పుడుతుందనేది చెప్పలేం! కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో ఆ ప్రేమలో పడే ఉంటారు. ఆ ప్రేమను తాము ప్రేమించిన వ్యక్తికి చెప్పాలని ఆరాటపడుతుంటారు. ఎదలోని ప్రేమను మనసుకు నచ్చిన వారికి చెప్పాలేకపోయినవారు ఇప్పటికీ ఉంటారు. తమలోని భావనలను ఎదుటివారికి చెప్పడానికి సరైన సమయం వాలెంటైన్స్ డే. దీనిని ఒక రోజు మాత్రమే కాదు మొత్తం ఎనిమిది రోజులు ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. ఈ ఎనిమిది రోజులకు రోజుకో స్పెషల్ గా జరుపుకుంటుంటారు. రోజ్ డే, చాక్లేట్ డే, ప్రమీస్ డే, ప్రపోజ్ డే ఇలా ఫిబ్రవరి 7 నుంచి 14వరకు జరుపుకుంటుంటారు. ఇక వాలెంటైన్ వీక్లో రెండవ రోజును అంటే ఫిబ్రవరి 8 ప్రపోజ్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున తాము ఇష్టపడే వారికి మనసులోని భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు ఈ ప్రపోజ్ డే.
ఈరోజున ఎదుటివారి పట్ల మీలో ఉన్న భావనలను వ్యక్తపరచడానికి కొన్ని మార్గాలను ఎంచుకోండి. వారికి ఇష్టమైన వాచ్ లేదా రింగ్ లేదా ఏదైనా వస్తువు గిఫ్ట్ గా ఇచ్చి మీ ప్రేమను వ్యక్తపరవచ్చు. కొంతమందికి కోటేషన్స్ రాసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఎదలోని మాటలను అందంగా కాగితంపై రాసి మీ ప్రేమను తెలియజేయండి. మొదటిసారి ప్రేమను చేప్పలనుకుంటున్నవారు తమ మనసులోని భావాలను మీ ఫోన్లో స్టేటస్ రూపంలో చెప్పండి.
Also Read:
Valentine Week: ప్రేమను వర్ణించడానికి ఎన్నో భావాలున్నాయి.. చూపించడానికి ఓ మార్గం ఉంది.. అదెంటంటే..