Viral: ఓరయ్యా.. శోభనం దాకా ఆగలేకపోయావా..? పెళ్లి వేదికపైనే.. కట్ చేస్తే ఆగమాగం!

|

May 22, 2024 | 1:11 PM

వివాహ వేడుక కాస్తా రణరంగంగా మారిపోయింది. పెళ్ళి కొడుకు చేసిన చిలిపి పనికి ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకునే దాకా వెళ్ళింది. దీంతో ఇరువురి బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది.

Viral: ఓరయ్యా.. శోభనం దాకా ఆగలేకపోయావా..? పెళ్లి వేదికపైనే.. కట్ చేస్తే ఆగమాగం!
Marriage
Follow us on

వివాహ వేడుక కాస్తా రణరంగంగా మారిపోయింది. పెళ్ళి కొడుకు చేసిన చిలిపి పనికి ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకునే దాకా వెళ్ళింది. దీంతో ఇరువురి బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటు చేసుకుంది.

హాపూర్‌లో పెళ్లి వేడుకలో వధువు తరఫు వారు వరుడిని కొట్టడమే కాకుండా పెళ్లికి వచ్చిన అతిథులను కూడా కొట్టారు. దీంతో వరుడి తరపు వారు అటువైపు ఉన్న వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన కల్యాణోత్సవంలో తొక్కిసలాటను సృష్టించింది. అర డజను మందికి పైగా గాయపడ్డారు. విషయం పోలీసుల వరకు చేరింది. హాపూర్ దేహత్ ప్రాంతంలోని మొహల్లా అశోక్‌నగర్‌లో వివాహ వేడుక జరుగుతుండగా, జయమాల సమయంలో, వరుడు అందరి ముందు వేదికపై వధువును ముద్దాడాడు. వరుడి చేసిన ఈ పనికి వధువు తరపు వారికి ఆగ్రహం తెప్పించింది. పెళ్లికొడుకుతో సహా పెళ్లికి వచ్చిన అతిథుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణ మొదలైంది. దీంతో కోపోద్రిక్తులైన వరుడి తరపు బంధువులు వధువుపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్‌లు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వధువు తరఫు ఆరుగురు గాయపడ్డారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. చివరికి పోలీసుల జోక్యంతో వివాహ తంతు ముగిసింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…