Russell’s viper: రక్త పింజర.. కాటు పడితే ఖతం.. ఇది గుడ్లు పెట్టదు.. కానీ

|

Mar 25, 2024 | 6:39 PM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద రక్త పింజర తరచుగా కనిపిస్తుంటుంది. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్త స్రావం ఎక్కువై ప్రాణాపాయం సంభవిస్తుంది. చిన్నపింజర పాములు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. పరిమాణంలో చిన్నగానే కనిపించినా విషపూరితమైనవి.

Russells viper: రక్త పింజర.. కాటు పడితే ఖతం.. ఇది గుడ్లు పెట్టదు.. కానీ
Russell's Viper
Follow us on

రక్త పింజర.. దీన్ని ఇంగ్లీషులో రసెల్స్ వైపర్ అంటారు.  దీనిని కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడూ దూకుడు స్వభావం కలది. భారతదేశంలో ఈ పాములు సంఖ్య ఎక్కువ. సహజంగా ఇవి ఎలుకలను వేటాడి తింటుంటాయి. ఈ పాము విషం శరీరంలో అంతర్గత రక్తస్రావాన్ని కలిగిస్తుంది.  ఈ పాము కాటు వేశాక రక్తనాళాల కణాల్లో కణజాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుంది. భారత్‌లో అత్యధిక పాముకాటు మరణాలకు కారణమైన 4 విష సర్పాలలో ఇది కూడా ఒకటి. ఈ పాము గరిష్ఠంగా 166 సెం.మీ. (5.5 అడుగులు) పొడవు పెరుగుతుంది. అన్ని పాములు గుడ్ల ద్వారా పిల్లల్ని కంటాయి. కానీ ఇది ఢిఫరెంట్. పిల్లలను కనడం ఈ పాము మరో ప్రత్యేకత. కొన్నిసార్లు వందల సంఖ్యలో పిల్లలను పెడుతుంది.

రక్త పింజరి పాము ముదురు గోధుమ రంగులో ఉంటుంది. దాని శరీరంపై మచ్చలు ఉంటాయి. దీని తల త్రిభుజాకారంలో ఉండి దవడ వద్ద గంత వంటి నిర్మాణం ఉంటుంది. ఇవి వెచ్చగావున్న స్థలాలలో ఉండవచ్చు, గడ్డి వాములు, ముళ్ళ పొదలలో ఇవి పొంచి ఉండవచ్చు. వీటిని గమనించిన వెంటనే దూరముగా పోవాలి. కరచిన వెంటనే విషం రక్తము ద్వారా శరీరమంతటా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క కాటులో ఇది పంపే విషం 16 మందిని చంపగలదు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..