Secret Room: 200 ఏళ్ల నాటి ఫామ్‌హౌస్‌లో రహస్య గదిని గుర్తించిన టిక్‌టాకర్.. ఓపెన్ చేసి చూడగా షాక్..

ఇప్పుడంటే బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ప్రజలందరూ తమ సంపదను బ్యాంకుల్లో దాచిపెడుతున్నారు. పూర్వ కాలంలో ఈ విధానం లేకపోవడం కారణంగా, దొంగల నుంచి తమ సంపదను రక్షించుకునేందుకు భారీ గొయ్యిలు తవ్వి అందులో దాచిపెట్టడం గానీ, రహస్య గదులు తవ్వి అందులో దాచుకోవడం గానీ చేసేవారు.

Secret Room: 200 ఏళ్ల నాటి ఫామ్‌హౌస్‌లో రహస్య గదిని గుర్తించిన టిక్‌టాకర్.. ఓపెన్ చేసి చూడగా షాక్..
Hidden Trapdoor

Updated on: Jul 10, 2023 | 4:08 PM

ఇప్పుడంటే బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ప్రజలందరూ తమ సంపదను బ్యాంకుల్లో దాచిపెడుతున్నారు. పూర్వ కాలంలో ఈ విధానం లేకపోవడం కారణంగా, దొంగల నుంచి తమ సంపదను రక్షించుకునేందుకు భారీ గొయ్యిలు తవ్వి అందులో దాచిపెట్టడం గానీ, రహస్య గదులు తవ్వి అందులో దాచుకోవడం గానీ చేసేవారు. ఈ కారణంగానే నేటి కాలంలో గుప్త నిధుల తవ్వకాలంటూ కొందరు దొంగలు ఆలయాలను, పురాతన ఇళ్లను తవ్వేస్తున్నారు.

ఈ మ్యాటర్ ఇలా ఉంటే.. తాజాగా ఓ టిక్ టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన ఫామ్ హౌస్‌లో 200 ఏళ్ల నాటి సెల్లార్‌‌ను కనుగొంది. ఈ ఇంట్లో ఒక సెల్లార్, రహస్య గది ఉందనే విషయం ఆమెకు ఇప్పటి వరకు తెలియదు. దాంతో ఆ గదిలో ఏమైనా ఉందేమో అని ఉత్సాహంతో వెతకడం మొదలు పెట్టింది. అయితే, పాపం ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ గదిలో ఏమీ లభించలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ సదరు మహిళ టిక్ టాక్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది.

ఇంగ్లండ్ లోని బ్రైటన్ ప్రాంతానికి చెందిన జెన్నిఫర్ మలఘన్.. తన తల్లిదండ్రుల పురాతన ఇంటికి మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఓ రహస్య గది డోర్‌ను కనిపెట్టింది. ఆ డోర్ ఓపెన్ చేయగా.. రహస్య గది కనిపించింది. అది చూసి అవాక్కయిన జెన్నిఫర్.. విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. ఆ రహస్య గదిలో ఏముందనేది వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. బేస్‌మెంట్ కింద ఉన్న ఈ గదిలో రహస్య నిధి ఏమైనా ఉండొచ్చని భావించింది జెన్నిఫర్. కానీ, పాపం ఆమె ఆశలు నిరాశగా మారాయి.

ఇవి కూడా చదవండి

44 సెకన్ల ఈ వీడియోలో గది మొత్తం చాలా చీకటిగా ఉంది. అందులో సామాగ్రి కూడా లేకుండా ఖాళీగా ఉంది. ఇది అయితే, 200 ఏళ్ల నాటి గది కావడంతో అంతా దుమ్ము, దూళి, చెదలుతో నిండిపోయింది. దానిని మొత్తం శుభ్రం చేయించింది యువతి. అయితే, ఇలాంటి గదులు బయటపడటం ఇదే కొత్త కాదు.. గతంలోనూ ఇలాంటి గదులు చాలా బయటపడ్డాయి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..