Gold Price Today (24-01-2021):కరోనా అనంతరం ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం ధర మెల్లగా దిగివస్తుంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చు తగ్గులున్నాయి. జనవరి రెండో వారంలో తొలుత భారీగా పెరిగిన బంగారం తాజాగా దిగివస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధర పతనమయ్యింది. అయితే బంగారం నగలు కొనుక్కోవాలంటే సరైన టైం చూసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ ల్లో గోల్డ్ కాస్ట్ రూ.330 మేర తగ్గింది. నేటి మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.50,130 అయింది. 22 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దీంతో తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 లకు చేరుకుంది. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో ప్యూర్ గోల్డ్ ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,130 ఉంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.160 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.150 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,100కి పతనమైంది.
అయితే బంగారం ధర మరింత దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవిని చేపట్టారు కనుక డాలర్ విలువ పెరిగే అవకాశం ఉంది.. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతాయని.. అయితే దేశీయ మార్కెట్ లో క్రమంగా బంగారం కొనుగోలు పెరిగింది కనుక డిమాండ్ పెరుగుతుందని బూలియన్స్ మార్కెట్ నిపుణుల అంచనా