బొద్దింకలతో విసిగి పోయారా ? ఇక చాలు.. ఇలా చేస్తే శాశ్వత పరిష్కారం..!

బొద్దింకలతో విసుగెత్తిపోతున్నారా..? సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి చిట్కా పాటించి అలిసిపోతున్నారా..? బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకోలేం.. ఎందుకంటే..అవి తరచుగా డ్రైనేజీలు, బాత్రూమ్‌ల ద్వారా కూడా మీ వంటగదిలోకి ప్రవేశించవచ్చు. అవి బ్యాక్టీరియా, అలెర్జీలకు కారణమవుతాయి. అందుకే బొద్దింకల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని వదిలించుకోవడం చాలా కష్టమని భావించే వారికి ఇక్కడ కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఉన్నాయి. ఇలాంటి సాధారణ పద్ధతులతో మీరు బొద్దింకలను శాశ్వతంగా నియంత్రించవచ్చు. బొద్దింక సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలాగో ఇక్కడ చూద్దాం..

బొద్దింకలతో విసిగి పోయారా ? ఇక చాలు.. ఇలా చేస్తే శాశ్వత పరిష్కారం..!
Easy Tips To Avoid Cockroaches At Home

Updated on: Oct 05, 2025 | 9:36 PM

బొద్దింకలు ప్రధానంగా ఆహారం వైపు ఆకర్షించబడతాయి.. అవి ఆహారంలోకి రాకుండా నిరోధించాలి. వంటగదిలో పడే చిన్న చిన్న ఆహారం ముక్కలను కూడా వెంటనే శుభ్రం చేయాలి. ఆహారం, పెంపుడు జంతువుల ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి. మురికి పాత్రలను సింక్‌లో ఉంచకూడదు. తిన్న వెంటనే వాటిని కడగాలి. రిఫ్రిజిరేటర్, స్టవ్‌టాప్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చెత్తను మూసిఉండే బుట్టలో వేసి ప్రతిరోజూ ఖాళీ చేయాలి.

బొద్దింకలకు నీరు అవసరం. ఏదైనా కుళాయిలు లేదా పైపులు లీక్ అవుతుంటే వాటిని వెంటనే మరమ్మతు చేయండి. బాత్రూమ్, వంటగది సింక్‌లలో నీటిని వెంటనే తుడవండి. సింక్‌లు, టబ్‌లను పొడిగా ఉంచండి. తేమ ఎక్కువగా ఉంటే వెంటిలేషన్ పెంచంది. లేదా డీహ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించండి.

బొద్దింకలు చిన్న చిన్న పగుళ్ల ద్వారా కూడా ఇంట్లోకి ప్రవేశించగలవు. గోడలు, అంతస్తులు, తలుపు చట్రాలలో పగుళ్లను సిమెంట్‌తో నింపాలి. పైపులు, వైర్లు ఇంట్లోకి ప్రవేశించే రంధ్రాలను కూడా మూసివేయాలి. అవి కిరాణా సంచులు లేదా కార్డ్‌బోర్డ్ పెట్టెల ద్వారా కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

బొద్దింకల సమూహాలను చంపడానికి ఎరలు ఉత్తమమైనవి. అవి నెమ్మదిగా విషాన్ని తమ గూటికి తీసుకువెళతాయి. అక్కడ అవి చనిపోతాయి. ఎరలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి ఉదాహరణకు సింక్‌ల కింద, చీకటి ప్రదేశాలలో పెట్టడం మంచిది. అలాగే, బొద్దింకల నివారణకు గమ్‌ప్యాడ్‌లు కూడా దొరుకుతున్నాయి. బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వాటిని ఉంచాలి.

బోరిక్ ఆమ్లం ప్రభావవంతమైన విషం. ఇది కూడా బొద్దింకల నివారణకు ఉపయోగపడుతుంది. దీనిని వస్తువుల వెనుక లేదా గోడల పగుళ్లలో తేలికగా పిచికారీ చేయాలి. ఇది విషపూరితమైనది. కాబట్టి, ఆహారం లేదా నీటి వనరుల దగ్గర దీనిని ఉపయోగించవద్దు. పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం ముఖ్యం.

కొన్ని సహజ నూనెలు లేదా ఆకులు బొద్దింకలను తరిమికొడతాయి. అవి బిర్యానీ ఆకుల వాసన లేదా నిమ్మ తొక్కలను ఇష్టపడవు. పిప్పరమింట్ ఆయిల్ వంటి సుగంధ నూనెలను నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఇవి బొద్దింకలను పూర్తిగా చంపకపోవచ్చు, కాబట్టి వాటిని ఇతర పద్ధతులతో కలిపి వాడాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..