Knowledge: మెట్రో రైలు ట్రాక్‌పై రాళ్లు ఎందుకు ఉండవు.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే..

|

Nov 21, 2022 | 5:10 PM

సాధారణంగా ఏ రైల్వే ట్రాక్‌పై చూసినా రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్‌ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో కంకర రాళ్లతో నింపేస్తుంటారు. ఈ కంకర రాళ్లను బాలస్ట్‌గా పిలుస్తుంటారు. ఇలా రైల్వే ట్రాక్‌ మధ్య కంకర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. పట్టాలు సరైన స్థానంలో ఉండేందుకు ట్రాక్‌ చుట్టూ కింద కంకరను పోసి సమం చేస్తుంటారు...

Knowledge: మెట్రో రైలు ట్రాక్‌పై రాళ్లు ఎందుకు ఉండవు.? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే..
Stones On Tracks
Follow us on

సాధారణంగా ఏ రైల్వే ట్రాక్‌పై చూసినా రాళ్లు కనిపిస్తాయి. ట్రాక్‌ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో కంకర రాళ్లతో నింపేస్తుంటారు. ఈ కంకర రాళ్లను బాలస్ట్‌గా పిలుస్తుంటారు. ఇలా రైల్వే ట్రాక్‌ మధ్య కంకర చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. పట్టాలు సరైన స్థానంలో ఉండేందుకు ట్రాక్‌ చుట్టూ కింద కంకరను పోసి సమం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రైలు పట్టాలపై వెళ్తోన్న సమయంలో పట్టాల నుంచి వచ్చే భారీ శబ్ధం తగ్గుతుంది.

అంతేకాకుండా ఈ రాళ్ల వెనక మరో కారణం కూడా ఉంది. సాధారణంగా రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమి కంటే కాస్త ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. రైల్వే పట్టాల పై ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు బరువు నియంత్రించడానికి ఈ రాళ్లు పనిచేస్తాయి. రైలు కదులుతున్న సమయంలో వచ్చే వైబ్రేషన్స్‌ కారణంగా ప్రమాదాలు జరగకుండా వీటిని ఉపయోగిస్తారు. ఇదంతా బాగానే ఉంది మరి మెట్రో రైలు ట్రాక్‌పై రాళ్లను ఎందుకు ఉపయోగించరని ఎప్పుడైనా ఆలోచించారా.?

దీనికి కూడా ఒక రీజన్‌ ఉంది. మెట్రో రైలు కూడా వేగంగా దూసుకెళుతుంది. అయినా కూడా ట్రాక్‌పై ఎలాంటి రాళ్లు ఉండవు. సాధారణంగా మెట్రో రైలు ట్రాక్‌ను భూమికి పైభాగంలో ఫ్లైఓవర్‌పై నిర్మిస్తారు. దీంతో అంతపైకి రాళ్లను జారవేయడం కష్టంతో కూడుకున్న పని అందుకే ట్రాక్‌ను కాంక్రీట్‌తో రూపొందిస్తారు. అంతేకాకుండా ట్రాక్‌ల వైబ్రేషన్‌ రాకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..