ఆర్థిక పరిస్థితులకు, వాస్తుకు మధ్య సంబంధం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అంటారు. ముఖ్యంగా మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు మిస్టేక్స్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసే ఆ వాస్తు తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మనలో చాలా మంది కొత్త చెప్పులు కొనుగోలు చేసినా పాత చెప్పులను అలాగే ఉంచుతుంటారు. పాడైపోయి, చిరిగిపోయిన చెప్పులను అలాగే ఉంచుతారు. అయితే ఇలా పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే ఉపయోగం లేని చెప్పులను బయటపడేయడమే బెటర్ అని అంటున్నారు.
* పాడై పోయిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నిల్వ ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. ఇది ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అప్పులు పెరగడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
* మనలో చాలా మంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లో అలాగే పెడుతుంటాం. అయితే ఇది కూడా మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పాత న్యూస్ పేపర్లను కుప్పగా మార్చడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు పేపర్లను బయటపడేయడం లేదా అమ్మేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
* పనికి రాని చీపుర్లను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీటివల్ల కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. చీపురును లక్ష్మీ దేవికి సూచికగా భావిస్తుంటారు. అందుకే చిపురు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంటిని ఊడ్చిన తర్వాత చిపురు అందరికీ కనిపించేలా పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తారు.
* ఇంట్లో పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడు బయట పడేస్తుండాలి. ముఖ్యంగా పనికిరాని ఇనుప సామానును ఇంట్లో పేరుకుపోకుండా చూసుకోవాలి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది. అదే విధంగా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయని అంటున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..