All India Radio: ఇప్పుడు వినోదానికి బోలెడు దారులు. సమాచారానికి ఇబ్బంది లేని పరిస్థితి. క్షణాల్లో కాదు కాదు లిప్తపాటులో ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా మన ముందు ప్రత్యక్షం అయిపోతుంది. అయితే, ఈ సమాచారం తొలినాళ్లలో ప్రపంచంలో రేడియోల ద్వారా పంపిణీ అయ్యేది. సమాచారం వేగంగా చేరవేయడం అనే విధానానికి రేడియో తరంగాల ఆవిష్కరణ పెద్ద మలుపు. ఇక రేడియో ద్వారా వార్తలు.. కార్యక్రమాల ప్రసారం చేయడం భారతదేశంలో సరిగ్గా ఇదేరోజున అంటే 23 జూలై 1927 న ప్రారంభం అయింది. వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ బొంబాయిలో తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రేడియో కేంద్రం తరువాత 1930లో జాతీయం చేశారు. దీనికి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా పేరు పెట్టారు. కొద్ది సంవత్సరాల తరువాత జూన్ 1936 లో, ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా మార్చబడింది. అదే సంవత్సరంలో, మొదటి న్యూస్ బులెటిన్ ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేశారు.
ఇక మన దేశంలో 1923 నుండి ప్రైవేట్ రేడియో క్లబ్‌లు ప్రారంభం అయ్యాయి. రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి జూన్ 1923 లో, కలకత్తా రేడియో క్లబ్ 5 నెలల తరువాత ప్రారంభించబడింది. అయితే, ఈ రెండింటి ట్రాన్స్మిటర్లు అంత శక్తివంతమైనవి కావు. కాబట్టి వాటికి చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే ప్రవేశం ఉంది. అందుకే అవి ఆ చుట్టుపక్కల కొద్ది దూరం మాత్రమే ప్రసారం అయ్యేవి.
స్వాతంత్య్ర సమయంలో, భారతదేశంలో మొత్తం 9 రేడియో స్టేషన్లు ఉండేవి. కానీ, పాకిస్తాన్ విడిపోయినప్పుడు, 3 రేడియో స్టేషన్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. భారతదేశానికి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, తిరుచిరపల్లి, లక్నో వద్ద స్టేషన్లు ఉన్నాయి. అప్పుడు జనాభాలో 11% కు మాత్రమే ఆల్ ఇండియా రేడియో ప్రసారాలు చేరుకునేవి. ఆల్ ఇండియా రేడియో పేరు 1956 లో ఆకాశవాణిగా భారత రేడియో మార్చారు. ఆ తరువాతి సంవత్సరంలో వివిద్ భారతి మరుసటి సంవత్సరం ప్రారంభించారు.
ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో ద్వారా 100 కి పైగా దేశాలలో 11 భారతీయ, 16 విదేశీ భాషలలో ప్రతిరోజూ 56 గంటల కార్యక్రమాలు ప్రసారంచేస్తున్నారు.
ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోని అతిపెద్ద మీడియా సంస్థగాచెప్పుకుంటున్నారు. భారతదేశ జనాభాలో 99.18% మందికి ఆల్ ఇండియా రేడియో అందుబాటులో ఉంది. ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలు 262 ప్రసార కేంద్రాల ద్వారా భారతదేశంలోని 91% ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలో రేడియో ప్రారంభం గురించి చెప్పుకుంటే, అది 1900 ల ప్రారంభం నుండిప్రారంభం అయింది. 24 డిసెంబర్ 1906 న, కెనడియన్ శాస్త్రవేత్త రెజినాల్డ్ ఫెస్సెండెన్ రేడియో స్టేషన్ లో వయోలిన్ వాయించారు. సుదూర సముద్రంలో తేలియాడుతున్న ఓడల్లోని రేడియో సెట్‌లో అతని వయోలిన్ శబ్దం వినిపించింది. ఆ విధంగా ప్రపంచంలో రేడియో ప్రసారం ప్రారంభమైంది.
మొదటి ప్రపంచ యుద్ధంలో రేడియో తరంగాలను విస్తృతంగా ఉపయోగించారు. క్రమంగా ప్రైవేట్ రేడియో స్టేషన్లు ప్రపంచంలో ప్రారంభమయ్యాయి. బీబీసీ ఇంగ్లాండ్‌లో ప్రారంభమైంది.
చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని విశేషాంశాలు ఇవే..
2020: చైనా తన మొదటి మార్స్ మిషన్‌ను ప్రారంభించింది. వెన్‌చాంగ్ ప్రయోగ సైట్ నుండి చైనా టియాన్వాన్ -1 ను విడుదల చేసింది.
2019: UK యొక్క కన్జర్వేటివ్ పార్టీ బోరిస్ జాన్సన్‌ను తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. మరుసటి రోజు జాన్సన్ UK ప్రధానమంత్రి అయ్యాడు.
2005: ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ రిసార్ట్ వద్ద జరిగిన బాంబు దాడిలో 88 మంది మరణించారు.
1962: ఐరోపాలో మిలియన్ల మంది ప్రజలు టెల్స్టార్ ఉపగ్రహం ద్వారా మొదటిసారి ప్రత్యక్ష ప్రసారాన్ని చూశారు. ఈ సంఘటన ఉపగ్రహ సమాచార రంగంలో ఒక ప్రధాన విజయంగా పరిగణించబడుతుంది.
1906: స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు
1904: చార్లెస్ మెన్చెస్ మొదటి ఐస్ క్రీమ్ కోన్ను సృష్టించాడు.
1903: ఫోర్డ్ తన మొదటి కారును విక్రయించింది
1829: యుఎస్ విలియం ఆస్టిన్ బర్ట్ టైపోగ్రాఫ్‌కు పేటెంట్ ఇచ్చారు, ఇది తరువాత టైప్‌రైటర్ అభివృద్ధికి దారితీసింది.
Also Radio: Five Horns Sheep: నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోన్న అయిదు కొమ్ముల గొర్రె.. ఎక్కడో తెలుసా.? Viral Video
Mercedes Benz: మెర్సెడెజ్ బెంజ్ కీలక నిర్ణయం.. 2022 నాటికి అన్ని విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలు