ప్రేమే సర్వస్వం అనుకున్నవాళ్ళు కొందరైతే.. ప్రేమకోసం సర్వం కోల్పోయిన వాళ్ళు మరికొందరు. తమ ప్రేమను సాకారం చేసుకోవడం కోసం పెద్దల్ని ఎదురించే వాళ్ళు ఇంకొందరు. అలాంటి ఎదిరించిన ప్రేమికులు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యే ఓ ప్రేమాలయం తెలంగాణలో ఉంది. దాని గురించి తెలుసుకుందా పదండి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లి సమీపంలోని శ్రీ సదనందాలయం వందలాది ప్రేమ వివాహాలకు వేదికగా నిలిచి ప్రేమాలయంగా ప్రసిద్ధి గాంచింది. 1970 లో అప్పటి ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య ఇక్కడి ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించి, స్వయంగా ఆయనే ప్రవచనాలు అందించేవారు. దీంతో అప్పట్లో భక్తుల కోలాహలం అధికంగా ఉండగా, రానురాను ఈ ఆలయం ప్రేమికులను ఏకంచేసే ప్రేమాలయంగా ప్రసిద్దిగాంచింది.
ఇక్కడ ఒకరి వెంట ఒకరు ఏడడుగులు నడిచి మూడుముళ్ళ బంధంతో దంపతులుగా మారిన జంటలు కలకాలం సుఖశాంతులతో వర్దిల్లుతాయనే సెంటిమెంట్ బలంగా ఉండటంతో తెలంగాణాలోని పలు ప్రాంతాల నుండి ప్రేమికులు తరలివచ్చి ఈ ఆలయంలోనే మనువాడుతారు. గతంలో ఇక్కడే పెళ్లిచేసుకొని దంపతులుగా మారిన అలనాటి ప్రేమికులు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునాడు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ఇలాంటి సదనందాలయాన్ని తెలంగాణా సర్కారు అభివృద్ధి పరచాలని పలువురు కోరుతున్నారు.
Also Read:
Viral News: “మూడేళ్లకే దున్నేస్తున్నాడు”.. నెట్టింట వైరల్‌గా మారిన బుడ్డోడి వీడియో
9 నెలల గర్భంతో ఎన్నికల బరిలోకి.. ఓటు వేసిన అనంతరం బిడ్డకు జననం.. ఆపై విజయం..
రెండో రోజు కూడా ‘ఉప్పెన’.. కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు