RBI: ఇంకా ప్రజల వద్దే భారీగా రూ. 2 వేల నోట్లు.. 6 నెలలు గడుస్తోన్నా..

|

Dec 01, 2023 | 6:06 PM

చలామణిలో ఉన్న 97.26 శాతం పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు చేరగా ఇంకా రూ. 9,760 కోట్ల విలువైన నోట్లు ప్రజలే వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. వ్యవస్థలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ ఈ ఏడాది మే 19వ తేదీన ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ..

RBI: ఇంకా ప్రజల వద్దే భారీగా రూ. 2 వేల నోట్లు.. 6 నెలలు గడుస్తోన్నా..
RBI 2k Notes
Follow us on

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకొని ఆరు నెలలు గడుస్తోన్న విషయం తెలిసిందే. ప్రజల వద్ద నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకోమని ఆర్‌బీఐ ఇప్పటికే తెలిపింది. అయితే ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ప్రజల వద్ద పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం తెలిపింది.

చలామణిలో ఉన్న 97.26 శాతం పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు చేరగా ఇంకా రూ. 9,760 కోట్ల విలువైన నోట్లు ప్రజలే వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. వ్యవస్థలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ ఈ ఏడాది మే 19వ తేదీన ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ రూ.2 వేల నోటు లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టంచేసింది.

బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి తొలుత ఆర్బీఐ సెప్టెంబర్‌ 30వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది. అయితే అనంతరం ఈ తేదీని అక్టోబర్‌ 7వ వరకు పొడగించారు. ప్రస్తుతం కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే నోట్లను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్‌ 30 నాటికి 97.26 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ కేంద్రాలకు వెళ్లలేని వారికి సైతం రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పించారు.

ఇందుకోసం రూ. 2 వేల నోట్లను పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చని తెలిపింది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పూర్‌, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే.. దేశంలో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2016 నవంబర్‌లో రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని బిజిసెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..