Srisailam Temple : రికార్డు స్థాయిలో అమ్మవారి హుండీ ఆదాయం.. భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి భారీగా కానుకలు

 శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. (రూ. 4,58,76,546/) నాలుగు కోట్ల,

Srisailam Temple : రికార్డు స్థాయిలో అమ్మవారి హుండీ ఆదాయం.. భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి భారీగా కానుకలు

Updated on: Mar 03, 2021 | 2:47 PM

Srisaila Devasthanam : శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. (రూ. 4,58,76,546/) నాలుగు కోట్ల, యాభై ఎనిమిది లక్షల, డెభై ఆరు వేల, ఐదు వందల నలభై ఆరు రూపాయలు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితో పాటు శివసేవకులు, ప‌లువురు భక్తుల‌ సహాయంతో లెక్కింపు జరిగింది. గత 42 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన కానుకలు నగదు రూపంలో నాలుగు కోట్ల యాభై ఏనిమిది లక్షల డెబ్బై ఆరువేల ఐదు వందల నలభై ఆరు రూపాయలు ఆదాయంగా వచ్చినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు.

నగదుతో పాటుగా 266 గ్రాముల బంగారం, 6 కేజీల 240 గ్రాముల వెండి ఆభరణాలు, 297 ఎస్ఏ డాలర్స్, 590 యూఏఈ దీర‌మ్స్‌, 105 ఖ‌తార్ రియాల్స్, 50 సింగపూర్ డాలర్లు, 60 యూరోస్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

రహదారి లేని గ్రామంలో పురిటి నొప్పులతో గర్భిణి అవస్థలు.. మంచంపై మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి

Vikarabad lady murder : వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మర్డర్, ప్రియురాల్ని గొంతుకోసి చంపిన ప్రియుడు