Science: దురద సమయంలో గోక్కోవడం ద్వారా హాయిగా ఉంటుంది.. ఎందుకో తెలుసా?

|

Feb 05, 2022 | 10:05 PM

Science: సాధారణంగానే ఏదో ఒక సందర్భంలో మనిషికి దురద వస్తుంటుంది. అయితే దురద మంచి అనుభూతిని కలిగిస్తుంది. గోక్కుంటున్నప్పుడు..

Science: దురద సమయంలో గోక్కోవడం ద్వారా హాయిగా ఉంటుంది.. ఎందుకో తెలుసా?
Itch
Follow us on

Science: సాధారణంగానే ఏదో ఒక సందర్భంలో మనిషికి దురద వస్తుంటుంది. అయితే దురద మంచి అనుభూతిని కలిగిస్తుంది. గోక్కుంటున్నప్పుడు ఏదో తెలియని ఒకరకమైన హాయిగా అనిపిస్తుంటుంది. అయితే, ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే విషయంపై పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి.. దీనికి గల కారణమేంటో తెలుసుకున్నారు..

దురద వచ్చినప్పుడు.. చేత్తో లేదా, వస్తువుతో గోక్కోవడం ద్వారా ఒక వ్యక్తి మంచి అనుభూతి చెందుతాడు. ఒక రకమైన ఆనందాన్ని పొందుతాడు. దీనికి కారణం.. మన మెదడుతో ఉండే కనెక్షన్స్ అని తేల్చారు సైంటిస్టులు. ఇలా హాయిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మనుషుల ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (fMRI) ను పరిశీలించారు. తద్వారా దురద వచ్చినప్పుడు మెదడులో కలిగే మార్పులను అధ్యయనం చేశారు.

సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి దురదతో ఉన్నప్పుడు మెదడు స్పందనలో మార్పులు మొదలవుతాయి. ఈ చర్య ఫలితంగా ఒక వ్యక్తి దురద అనుభూతిని పొందుతారు. అంటే, మనకు ఏదైనా గాయం అయినా, కాలినా వెంటనే చలనం ఏ విధంగా అనిపిస్తుందో. దురద వచ్చిన వెంటనే వ్యక్తులు కూడా మాసికంగా అనుభూతిని పొందుతారు. అయితే, దురద కేవలం మనుషులకే కాదు, జంతువులకు కూడా వస్తుందని నివేదిక చెబుతోంది. నీటిలో ఉండే చేపకు కూడా దురద వస్తుందట. అయితే, వాటి హార్మోన్లలో తేడా కనిపించలేదని చెబుతున్నారు పరిశోధకులు.

ఇదిలాఉంటే.. ఒక వ్యక్తికి దురద కలిగినప్పుడు శరీరంలో కొన్నిరకాల స్త్రావలు విడుదలవుతాయి. ఇవి నరాల ద్వారా వెన్నెముకకు సమాచారాన్ని అందిస్తాయి. వెన్నెముక ఈ విషయాన్ని మెదడుకు ప్రసారం చేస్తుంది. వ్యక్తి మళ్లీ మళ్లీ దీన్ని చేయడం ప్రారంభిస్తాడు. అలా దురద వల్ల కలిగే అనుభూతి ప్రత్యేకంగా ఉంటుందని హెల్త్‌లైన్ నివేదిక చెబుతోంది.

Also read:

India vs West Indies: మూడంకెల ముచ్చట తీరేనా? కోహ్లీ సెంచరీతో ఆ దిగ్గజాల స్పెషల్ రికార్డులకు బ్రేకులు..!

Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..

Earthquake: ఆఫ్ఘాన్‌ – తజకిస్థాన్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం.. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు..