Sankranthi Festival 2022: మకర సంక్రాంతి పండగ జరుపుకునే విషయంలో మరోసారి గందరగోళం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక తేదీన ప్రకటిస్తే, అది తప్పు అంటున్నారు పంచాంగ కర్తలు. సంక్రాంతి(Sankranthi ) పండగ తేదీ విషయంలో మరోసారి అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే జనవరి 14వ తేదీనే జరుపుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు జనవరి 15వ తేదీ సంక్రాంతి పండగ అని ప్రకటించడంతో దానికి అనుగుణంగా ప్రజలు కూడా పండగ ఏర్పాట్లలో మునిగిపోయారు. నగరాల్లో ఉన్న వారు కూడా పల్లెబాట పట్టారు. ఇప్పటికే ఏపీలోని కోనసీమ లాంటి ప్రాంతాల్లో పండగ సంబరాలు ఊపందుకున్నాయి. ముగ్గురు పోటీలు, ఎడ్ల పందేలు జోరుగా జరుగుతున్నాయి. విద్యార్థులకు స్కూల్స్ సెలవులు ఇవ్వడంతో పిల్లలు గ్రామాలలో భోగిమంట వేసేందుకు దుంగలు రెడీ చేసుకుంటున్నారు. మరోపక్క భోగి పిడకల దండలు ఇప్పటికే రెడీ చేసారు.
అయితే మకర సంక్రాంతి పండగ తేదీపై మాత్రం అయోమయస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పుడు పండగ జరుపుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. దేశంలోని 27 రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్రాంతి పండగను జనవరి 14వ తేదీనే జరుపుకుంటున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం జనవరి 15వ తేదీన పండగ జరుపుకోవాలని నిర్ణయించాయి. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
దృగ్గణిత పంచాంగం ప్రకారం జనవరి 14వ తేదీ 2 గంటల 29 నిమిషాలకు సంక్రాంతి ప్రవేశిస్తుందని, అందుకే 14వ తేదీనే జరుపుకోవాలని పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ సూచిస్తున్నారు. దీంతో 14వ తేదీనే మకర సంక్రాంతిగా ప్రకటించాలని సూచిస్తున్నారు. పూర్వ గణిత పంచాంగ కర్త లకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పదవులను ఇచ్చి పంచాంగలను మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు .
పంచాంగకర్తల సూచనల ప్రకారం జనవరి 14వ తేదీన సంక్రాంతి పండగ జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటిస్తాయా ? లేక జనవరి 15వ తేదీనే నిర్వహించుకోవాలని సూచిస్తాయా ? అనేది చూడాలి.
Read Also…. PM Security Breach: పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం