Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరేళ్ల కుమార్తెను 19 పిల్లులతో కలిసి బంధించిన తల్లి..! కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే..?

Russian Mother: ప్రపంచంలోని ప్రతి తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది. కానీ కొంతమంది హృదయం లేని తల్లుల కథ వింటే అందరు ఆశ్చర్యపోతారు. తాజాగా రష్యాకి

ఆరేళ్ల కుమార్తెను 19 పిల్లులతో కలిసి బంధించిన తల్లి..! కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే..?
Russian Mother
Follow us
uppula Raju

|

Updated on: Sep 03, 2021 | 10:21 PM

Russian Mother: ప్రపంచంలోని ప్రతి తల్లి తన పిల్లలను ప్రేమిస్తుంది. కానీ కొంతమంది హృదయం లేని తల్లుల కథ వింటే అందరు ఆశ్చర్యపోతారు. తాజాగా రష్యాకి చెందిన ఓ తల్లి వార్తల్లో నిలిచింది. ఈమె నమ్మడానికి కష్టంగా ఉండే ఓ పని చేసింది. తన 6 ఏళ్ల కుమార్తెను 19 పిల్లులతో కలిసి గదిలో బంధించింది. విషయం తెలిసిన తర్వాత అందరు ఈమెను తిట్టిపోశారు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తన బిడ్డపై ఇంత క్రూరత్వం చూపించిన తల్లి పేరు ఎల్ప్రికా రెనే. ఈమె తన 6 ఏళ్ల కుమార్తె డాట్సేని 19 పిల్లులతో కలిసి ఓ రహస్య గదిలో బంధించింది. ఈ గదికి కిటికీ కూడా లేదు. దీంతో ఆ అమ్మాయి చాలా కాలం పిల్లులతో కలిసి జీవించింది. అంతేకాదు ఆకలిని తీర్చుకోవడానికి ఆమె పిల్లులు తినే ఆహారం తినవలసి వచ్చింది. ఎల్ప్రికా రెనే తన కూతురును చూడటానికి ఇక్కడకి రాకపోయేది.

కొన్ని రోజుల తర్వాత విషయం బయటికి రావడంతో పోలీసులు ఆ బాలికను రక్షించారు. పిల్లులతో జీవించడం వల్ల ఆ అమ్మాయి అనారోగ్యానికి గురైంది. చిన్నారికి మానవ భాష అర్థం కావడం లేదు. అంతేకాదు ఆమె పిల్లుల వలె నడవడానికి ప్రయత్నిస్తుంది. చాలా రోజులకి ఒకసారి ఆ గదిలో ఉండే చెత్తను శుభ్రం చేయడానికి ఎల్పిక అక్కడికి వెళ్లేది. 35 ఏళ్ల తల్లి తన పెద్ద కుమార్తెతో మరొక స్మార్ట్ హోమ్‌లో నివసించేది.

ఇలా ఎందుకు చేశావని ఆల్ప్రికోని అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానమిచ్చింది. 3 సంవత్సరాల వయస్సులో తన కుమార్తె ప్రవర్తనలో వింత మార్పును గమనించానని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ వృద్ధుడు పిల్లులకు ఆహారం ఇవ్వడాన్ని చూసిన కొంతమంది స్థానికులు పోలీసలకు సమాచారం అందించారు. అప్పుడు ఈ రహస్యం బయటపడింది. అయితే ఆ వృద్ధుడు ఎల్ప్రికా రెనే తండ్రిగా నిర్ధారించారు. ఇప్పటికి వీరిద్దరు కలిసి ఆ అమ్మాయిని ఎందుకు బంధించారో సరైన కారణాలు మాత్రం చెప్పడం లేదు.

అమ్మాయిలు ఈ 4 అలవాట్లున్న అబ్బాయిలను కచ్చితంగా తిరస్కరిస్తారు..! ఎందుకంటే..?

Afghanistan Crisis: 450 మంది తాలిబన్లు హతం.. మరోసారి పంజా విసిరిన పంజ్‌షేర్‌..

Chittoor District: చిత్తూరు జిల్లాలో సంచలనం… 74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా