Raw Milk: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, బయోటిన్, లాక్టిక్ యాసిడ్, మెగ్నీషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇంట్లోని పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కరూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తారు. అయితే పాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణ కూడా ఉపయోగపడుతాయి. పచ్చిపాలు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. మచ్చలు, గుర్తులను తొలగిస్తుంది. అంతేకాదు పాలని ఉపయోగించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చి పాల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
1. డెడ్ స్కిన్ తొలగిపోతుంది
పెరుగుతున్న కాలుష్యం కారణంగా చర్మం దెబ్బతింటుంది. కొంత కాలం తర్వాత ముఖంపై డెడ్ స్కిన్ పేరుకుపోతుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం ద్వారా డెడ్ స్కిన్‌ను సులభంగా తొలగించుకోవచ్చు. దీని కోసం మీరు ఓట్స్, పచ్చి పాలతో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. రెండింటినీ కలిపి స్క్రబ్బింగ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
2. మెరుస్తున్న చర్మం
పచ్చి పాల ప్రయోజనం ఏంటంటే ఇది చర్మం లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం పచ్చి పాలని దూదితో తీసుకొని ముఖానికి రాసుకోవాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే టోన్డ్ మిల్క్‌ని ఉపయోగించవచ్చు.
3. యాంటీ ఏజింగ్
పాలలో ఉండే విటమిన్ ఎ, బి యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. ముఖాన్ని క్లీన్‌గా ఉంచుతాయి. మచ్చలని తొలగిస్తాయి.
4. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి
మీరు పాలను సహజమైన క్లెన్సర్‌గా ఉపయోగిస్తే అది చాలా కాలం పాటు చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందులోని విటమిన్లు ఎక్స్‌ఫోలియంట్‌గా పని చేస్తాయి. చర్మంలో తేమ కూడా అలాగే ఉంటుంది.