Ravana: నాలుగు ఎయిర్ పోర్టులు.. ఒక విమాన రిపేర్ సెంటర్.. వేల ఏళ్ల క్రితమే నిర్మించిన రావణ! శ్రీలంకలో బయటపడిన ఆనవాళ్లు!

|

Nov 16, 2021 | 3:14 PM

ప్రపంచంలో తొలి వైమానికుడు ఎవరో తెలుసా? వెంటనే అందరూ చెప్పే సమాధానం రైట్ సోదరులు అని. ఇది ఆధునిక కాలానికి సంబంధించి కరెక్ట్ జవాబే. అయితే, మాన్ పురాణాలకు సంబంధించి మాత్రం రావణుడు మొట్టమొదటగా విమానం నడిపాడు.

Ravana: నాలుగు ఎయిర్ పోర్టులు.. ఒక విమాన రిపేర్ సెంటర్.. వేల ఏళ్ల క్రితమే నిర్మించిన రావణ! శ్రీలంకలో బయటపడిన ఆనవాళ్లు!
Ravana Pushpaka Vimanam
Follow us on

Ravana: ప్రపంచంలో తొలి వైమానికుడు ఎవరో తెలుసా? వెంటనే అందరూ చెప్పే సమాధానం రైట్ సోదరులు అని. ఇది ఆధునిక కాలానికి సంబంధించి కరెక్ట్ జవాబే. అయితే, మాన్ పురాణాలకు సంబంధించి మాత్రం రావణుడు మొట్టమొదటగా విమానం నడిపాడు. ఆయన విమానం పేరు ‘దండు మోనరా’. పురాణాల్లో ఉన్నది పట్టుకుని నిజం అన్నట్టు చెబుతున్నామని అనుకోవద్దు. రావణుడు వేల ఏళ్ల క్రితమే విమానాన్ని నడపడమే కాదు తన రావణ రాజ్యంలో ఎయిర్ పోర్టులు కూడా ఏర్పాటు చేశాడు. దీనికి ఆధారాలు కూడా దొరికాయి. రావణుడి విమాన కథ అధ్యయనానికి శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ పేరే ‘ఏవియేటర్‌ రావణ’ . దీనికి సహకరించాల్సిందిగా మన దేశ ప్రభుత్వాన్ని కోరింది శ్రీలంక ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. అసలు రావణుడి విమానం గురించిన విశేషాలు ముందు తెలుసుకుందాం. తరువాత శ్రీలంక చేసిన అధ్యయనంలో ఏమి తెలిందో కూడా తెలుసుకుందాం.

నెమలి ఆకారంలో..

రావణుని దగ్గర వేల ఏళ్ల క్రితం ఉన్న ‘దండు మోనరా’ విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదట. దండు మోనరా అంటే ఎగిరే నెమలి అని అర్థం. ఇక ఈయన ఆధ్వర్యంలో విమానాశ్రయాలు ఏర్పాటు అయ్యాయి. అంతే కాదు విమానాల రిపేరు కోసం ఒక ప్రదేశం కూడా ఉండేది. ఆ విమానాల మరమ్మతు కేంద్రం ఉన్న ప్రాంతం ‘గుర్లపోత’. దీని ప్రస్తావన వాల్మీకి రామయనంలోనూ ఉందని చెబుతారు. సింహళభాషలో గుర్లపోత అంటే పక్షి వాహనం అని అర్ధం. సీతను ఎత్తుకుపోయేటప్పుడు పుష్పకవిమానంలో రావణుడు భారత్ వచ్చాడని చెబుతారు. అంతేకాదు.. లంకలో రావణ వధ అనంతరం రాముడు సీతామాతను తీసుకుని అయోధ్యకు పుష్పక విమానంలో వెళ్లాడని రామాయణం చెబుతుంది.

శ్రీలంక ఇప్పుడు ఏమి శోధిస్తోంది..

రావణుడి వద్ద విమానాలున్నాయని ఇతిహాసాలలో చెప్పిన అంశాలపై సమగ్ర అధ్యయనానికి శ్రీలంక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ పేరే ‘ఏవియేటర్‌ రావణ’. ఈ పరిశోధనల్లో సహకరించాలని భారత్ ను లంక ప్రభుత్వం కోరింది. రావణుడి విమానాల ఉనికిపై నిజానిజాలు నిగ్గుదేల్చే క్రమంలో శ్రీలంక సర్కార్ పరిశోధన మొదలు పెట్టింది. దీనికోసం ఓ పరిశోధక బృందాన్ని శ్రీలంక సర్కార్ ఏర్పాటుచేసింది. రెండేళ్ల కిందట పౌర విమానయాన నిఫుణులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖ అధికారుల సమావేశం జరిగింది. రావణుడు తన విమానంలో భారత్ కు ప్రయాణించాడని ఈ బేటీలో నిర్దారణ చేశారు. ఇక ఈ విషయంపై పూర్తి స్థాయి పరిశోధనలకు లంక ప్రభుత్వం 5 మిలియన్ శ్రీలంకన్ రూపీస్( రూ.18.41 లక్షలు) వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, ఈ సమావేశం తరువాత పరిశోధనలకు అంతరాయం కలిగింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పరిశోధనలకు బ్రేక్ పడింది. తాజాగా కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో తిరిగి పరిశోధన ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో చేయూత నివ్వాలని భారత్ కు విజ్ఞప్తి చేసిన మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం . ఇది శ్రీలంక జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించింది.

పరిశోధనల్లో ముందడుగు..

ఈ పరిశోధనల్లో పెద్ద ముందడుగు పడింది. శ్రీలంక సర్కార్ లంకలో ఐదు విమానాశ్రయాలను గుర్తించింది. గుర్లపోతవద్ద ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని సైతం ఉన్నట్లు శ్రీలంక పరిశోధకులు చెబుతున్నారు. వీటన్నింటిని హనుమంతుడు కాల్చి వేశాడని వారంటున్నారు.

లంకలో అద్భుతమైన రవాణా వ్యవస్థ…

భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక, ఇంజీనీరింగ్ నైపుణ్యం ఆనవాళ్లు శ్రీలంకలో లభించాయి. రావణుడి అర్కిటెక్చర్ ప్రతిభకు నిదర్శనంగా లంక రవాణా వ్యవస్థలు నిలుస్తున్నాయి. లంకా నగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మితమైందని రామాయణం చెబుతోంది. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని రావణుడు నిర్మించాడు. అప్పటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవట. ఇప్పటికీ లంకలో రావణ కాలంనాటి అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఈ సొరంగాలతో లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి అనుసంధానం ఉంది. మరో అద్భుతం.. వానరసేన నిర్మించిన నీటిలో తేలే బండరాళ్లతో నిర్మించిన రామసేతు.. ఈ నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్‌లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు. లైట్‌వెయిట్‌ స్టోన్స్‌, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.
ఇప్పటికీ 30కి.మీ మేర రామసేతును మనం చూడవచ్చు.

రావణుడి ఆరాధన..

సింహాళీ బౌద్ధ సమూహాలు రావణుడిని ఆరాధిస్తారు. శ్రీలంక ప్రయోగించిన తొలి శాటిలైట్‌కు ‘రావణ-1’ అని పేరు. అదేవిధంగా రావణుడి పేరు వచ్చేలా ‘రావణ బాలాయ’ అన్న పేరు సింహాళీ బౌద్ధ గ్రూపు పెట్టుకుంది. ఇక రావణుడిని అరాధించే వారిలో తమిళనాడులోని ద్రవిడ పార్టీ నేతలు ఉన్నారు. రావణుడు.. రామాయణం… భారతీయ సంస్కృతి, నాగరికతలు ఒకదానికొకటితో అనుసంధానమైన అంశాలు. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాలు.. ఏడువేల సంవత్సరాల క్రితమే భారత ఉపఖండంలో విలసిల్లిన అద్బుత నాగరికతకు సాక్ష్యం

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..