Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిశ్చలంగా ఉన్నాయి. వరుసగా 25వ రోజు కూడా వాటి రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 7వ తేదీకి ముందు వరుసగా డీజీల్, పెట్రోల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలతో సామాన్య ప్రజానికం హడలిపోయింది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. ఆ కారణంగానే వరుసగా ఇంధన ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
కాగా, శుక్రవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.71గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 73.87 స్థిరంగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ అదే పరిస్థితి. పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా, డీజిల్ ధర రూ.80.51గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా, డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంధన రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. విజయవాడలో శుక్రవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ.89.44 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.82.54 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్ లీటర్ ధర రూ.89.92 కాగా, డీజిల్ ధర రూ.82.98 వద్ద నిలకడగా ఉంది.