కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాస్త ఆదరిస్తే చాలు.. వాటి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకుంటాయి. మనుషుల కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాయి. అలాంటిది తన యజమాని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంతో ఆ కుక్క అన్నపానీయాలు మానేసి అహర్నీశలు రోధిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన కన్నాపురం వెంకట్ గౌడ్ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందారు. వెంకట్ గౌడ్‌కు కుక్కలంటే అపరిమితమైన ప్రేమ. గత కొన్ని ఏళ్లుగా ఆయన ఎన్నో శునకాలను పెంచుకుంటున్నాడు. వాటిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నాడు. అందులో ‘వీరు’ అనే కుక్కను గత ఏడాది కాలంగా పెంచుకుంటున్నాడు. అయితే, ఇటీవల వెంకట్ గౌడ్ మృతి చెందడంతో వీరు..తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉన్న వెంకట్ గౌడ్ ఫోటోను చూస్తూ అరుస్తూ రోదిస్తోంది. గత కొద్ది రోజులుగా అది తిండికూడా తినడం లేదు.
తమ తండ్రి మరణించిన నాటి నుండి.. వీరు ఇలాగే ఫోటోను చూస్తూ ఏడుస్తోందని వెంకట్ గౌడ్ కుమారుడు చెబుతున్నాడు. మరణించిన యజమాని పట్ల శునకం చూపిస్తున్న విశ్వాసానికి స్థానికులు సైతం నివ్వెరపోతున్నారు. ఇంట్లో ఏడుస్తూ..ఫోటో కేసి చూస్తూ..ఆహారం మానేసిన శునకం బాధ పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
నిజంగానే కుక్కల విశ్వాసాన్ని ప్రతిబింబించే ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. కేవలం కాస్త ఫుడ్ పెట్టి.. ప్రేమగా చూసుకుంటే చాలు ప్రాణాలు సైతం లెక్కజేయకుండా యజమాని కోసం ముందుకొస్తాయి. పాములతో పోరాడి మరణించిన శునకాల కథలు అనేకం. సొంత మనుసుల్లో స్వార్థాల ఉచ్చులో పడి.. బంధాలకు విలువివ్వని ప్రస్తుత సొసైటీలో శునకాలు చూపించే ప్రేమ, వాత్సల్యం వెలకట్టలేనివి.
అంతే కాదు రోజూ బిజీ షెడ్యల్స్‌లో వారితో కొంత సమయం గడిపితే మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన సెలబ్రిటీలు సైతం పెట్ డాగ్స్ పెంచుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
Also Read:
ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు
పాలసీలు చేయిస్తారు.. ప్రాణాలు తీసేస్తారు.. కరడుగట్టిన హంతకులు.. సంచలన నిజాలు