Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు ఎవ్వరితో కలవరు.. మాట్లాడటానికి ఇష్టపడరు..?

|

Feb 02, 2022 | 3:48 PM

Zodiac Signs: కొంతమంది అంత తొందరగా ఎవ్వరితో కలువలేరు. బిడియంగా ఒంటరిగా గడుపుతారు. ఫంక్షన్లు, మీటింగ్‌లు మొదలైన

Zodiac Signs: ఈ 4 రాశుల వ్యక్తులు ఎవ్వరితో కలవరు.. మాట్లాడటానికి ఇష్టపడరు..?
Zodiac Signs
Follow us on

Zodiac Signs: కొంతమంది అంత తొందరగా ఎవ్వరితో కలువలేరు. బిడియంగా ఒంటరిగా
గడుపుతారు. ఫంక్షన్లు, మీటింగ్‌లు మొదలైన వాటిని తిరస్కరిస్తారు. అపరిచితులతో అసౌకర్యంగా
మెలుగుతారు. అలా ఉండటం వల్ల వారిని నిందించడంలో అర్థం లేదు. కానీ వారు సామాజికంగా
ఒంటరివారు ఎంత ప్రయత్నించినా కలవడం కొంచెం కష్టమే. జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు
రాశుల వారు ఈ కోవలోకి వస్తారు. వారి గురించి తెలుసుకుందాం.

1. మకరరాశి

మకరరాశి వారు వ్యక్తులతో కలుపుగొలుపుగా ఉండలేరు. అసౌకర్యంగా ఇబ్బందిగా ఫీలవుతారు.
ఎక్కువ మందికి తెలియని పార్టీకి వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే వారి స్నేహితుల సర్కిల్
విషయంలో వారు సంతోషంగానే ఉంటారు. అందుకే ఎక్కువ గంటలు వారితోనే గడపుతారు.

2. కుంభ రాశి

కుంభ రాశిలోని వ్యక్తులు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు దూరంగా ఉంటారు. ఒక వ్యక్తి అభిరుచులు,
అలవాట్లు అతనికి నచ్చకపోతే వెంటనే అతడిని తిరస్కరిస్తారు. అతడి నుంచి తప్పించుకునేందుకు
ప్రయత్నం చేస్తారు. అపరిచితులతో సంభాషించడానికి ఇష్టపడరు. ఎప్పుడు మాట్లాడినా ఏదో
విధంగా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటారు.

3. కన్య

కన్యా రాశి ప్రజలు సామాజిక కార్యక్రమాలు, శుభకార్యాలకు వెళ్లమని అందరిని ప్రోత్సహిస్తారు.
కానీ వారు మాత్రం వెళ్లరు. వారికి ఇష్టం లేని వారితో కటువుగా వ్యవహరిస్తారు. వారిని ఎప్పుడు
కలవకూడదని అనుకుంటారు. ఆసక్తి లేని ప్రదేశాలకు వెళ్లడం ఇష్టముండదు. ఈ వ్యక్తులు వారి
సొంత అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరు చెప్పినా వినరు. అందరు తనమాటే
వినాలని పట్టుబడుతారు. అందుకే చాలా తక్కువ మందితో కనిపిస్తారు.

4. వృషభం

వృషభ రాశి వ్యక్తులు సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటారు. ఈ రాశివారి ప్రవర్తన చాలా
చిత్రంగా ఉంటుంది. ఎవ్వరితోనూ సరిగ్గా కలవరు. గౌరవ, మర్యాదలను పాటించరు. కానీ
అందరిని సులభంగా నమ్ముతారు. ఈ రాశి చక్రం ప్రజలు గెట్-టుగెదర్ లాంటి వాటికి కూడా
వెళ్లరు. ఏ వేడుకైనా కూడా దూరంగా ఉండటానికి ఇష్టపడుతారు.

UPI Free: దుకాణదారులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది పాటు UPI ఉచితం

అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..

తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?