Pensioners Life Certificate: ప్రభుత్వం గడువు ముగిసినా.. పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.. ఎలాగంటే!

|

Dec 01, 2021 | 4:42 PM

Pensioners Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని..

Pensioners Life Certificate: ప్రభుత్వం గడువు ముగిసినా.. పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.. ఎలాగంటే!
Follow us on

Pensioners Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ సర్టిఫికేట్‌ అందించడం తప్పనిసరి అయితే ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాల్సి ఉండేది. కాని దాని గడువు పెంచింది ప్రభుత్వం. డిసెంబర్ 31 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే గడువు ముగిసినా సర్టిఫికేట్‌ను సమర్పించేందుకు సమయం ఉంటుంది. వృద్ధులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లలో కూడా లైఫ్ సర్టిఫికెట్సమర్పించే వెసులుబాటు ఉంది. వృద్ధులు కార్యాలయాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని రూపొందించుకుని సబ్మిట్ చేయడం చాలా కష్టతరంగా మారింది. సర్టిఫికేట్‌ సమర్పించేందుకు గడువు ముగిసినా సమర్పించేందుకు వెసులుబాటు ఉంటుంది.

కానీ కొన్ని విషయాలను మాత్రం గుర్తించుకోవాలి. ఏంటంటే ఒక సారి పెన్షన్‌ సర్టికేట్‌ సమర్పించినట్లయితే అది సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకు ముందు మీరు ఏ నెలలో ఏ తేదీన సమర్పించారో.. ఇప్పుడు మళ్లీ అదే నెల, ఈ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబర్‌ 30 గడిచినా ఎలాంటి సమస్య ఉండదు. ఇక గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. గడువు ముగిసినా సమస్య ఉండదు. ఇంతకు ముందు మీరు జీవన్‌ ప్రమాణ్‌ ల ఏదా లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఏ నెలలో, ఏ తేదీన సమర్పించారో చూసుకోవాలి. ఆ నెల, ఆ తేదీ వచ్చే వరకు మీకు పెన్షన్‌ అందుతూనే ఉంటుంది. మీరు ఇంతకు ముందు సర్టిఫికేట్‌ సమర్పించి ఏడాది దాటితే తప్ప మీకు పెన్షన్‌ ఆగడం అనేది ఉండదు.
ఈపీఎస్‌95 కింద పెన్షన్‌ తీసుకుంటున్న పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను ఎప్పుడైనా సమర్పించవచ్చు. మీరు సమర్పించిన తేదీ నుంచి సంతవ్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే 2019, డిసెంబర్‌లో పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్‌లను సమర్పించే నిబంధనలలో ఈపీఎఫ్‌ఓ మార్పులు చేసింది.

ఈపీఎఫ్‌ నిబంధనల ప్రకారం.. ఈపీఎస్‌ పెన్షనర్లు గత సంతవ్సరం డిసెంబర్‌ 15, 2020న లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించినట్లయితే మళ్లీ డిసెంబర్‌ 15, 2021లోపు సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెన్షన్‌ నిలిచిపోతుంది.

జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి..

పెన్షనర్‌ తప్పకుండా చెల్లుబాటు అయ్యే ఆధార్‌ నెంబర్‌ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ సర్టిఫికేట్‌ను రూపొందించాలనుకునే పెన్షనర్ తప్పనిసరిగా పని చేసే మొబైల్ నెంబర్‌ను ఉండటం తప్పనిసరి. అన్నిటికంటే ముందుగా పెన్షనర్ ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో ఇలా సబ్‌మిట్‌ చేయండి

► పెన్షనర్ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

► తర్వాత పెన్షనర్ తన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) ఇలా పూర్తి వివరాలు నమోదు చేయాలి.

► సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఓటీపీ వచ్చాక ఆ నెంబర్‌ను కాపీ చేసి నమోదు చేయాలి. తరువాత ప్రమాణ్ ఐడీ జనరేట్ అవుతుంది.

► ఒకవేళ మీరు ఇప్పటికే ప్రమాణ్ ఐడీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు పై స్టెప్స్ ఫాలో కాకుండా నేరుగా యాప్‌లో లాగిన్ కావచ్చు. ఇందుకు ఒకసారి ఓటీపీ ధృవీకరిస్తే సరిపోతుంది.

► లాగిన్ అయ్యాక ‘జనరేట్ జీవన్ ప్రమాణ్ (Generate Jeevan Pramaan)’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్, మొబైల్ నంబర్‌లను నమోదు చేయాలి.

► ఇప్పుడు జనరేట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని నమోదు చేయాల్సి ఉంటుంది.

► పీపీఓ నెంబర్, పేరు, పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీ పేరును నమోదు చేయాలి. ఆధార్ డేటాను ఉపయోగించి, పెన్షనర్ వేలిముద్ర, ఐరిష్‌ను స్కాన్ ద్వారా స్వయం ధృవీకరణ చేయాలి.

► ధృవీకరణ పూర్తయిన తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రింట్ కాపీ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాని డిజిటల్ ప్రింట్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లైఫ్ సర్టిఫికెట్ కాపీ కనిపించిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే, ఇక లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ చేసి సబ్మిట్ చేసినట్లవుతుంది. ఈ విధానాల ద్వారా పెన్షనర్లు ఆన్‌లైన్‌లో జీవన్‌ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్‌ చేయవచ్చు.

బ్యాంకు ద్వారా కూడా సర్టిఫికేట్‌ సమర్పించవచ్చు..

లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పమర్పించవచ్చు. మీరు పెన్షన్‌ పొందే బ్యాంకుకు వెళ్లి కూడా లైఫ్‌ సర్టిఫికేట్‌కు సంబంధించిన ఫారమ్‌ నింపి కూడా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు జిరాక్స్‌ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా సర్టిఫికేట్‌ సమర్పించే పని పూర్తి చేసుకోవచ్చు.

డోర్‌ సెఫ్టి బ్యాంకింగ్‌ సహాయంతో..

డోర్‌ సెఫ్టి బ్యాంకింగ్‌ సహాయంతో లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఈ డోర్‌ సెఫ్టి సదుపాయం ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నాయి. అలాగే డోర్‌సెఫ్టి బ్యాంకింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. అలాగే https://doorstepbanks.com/ వెబ్‌సైట్‌ ద్వారా కూడా సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన ఏమైనా అనుమానాలుంటే కస్టమర్ కేర్‌ టోల్ ఫ్రీ నంబర్ 18001213721 లేదా 18001037188కి కూడా కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.

పోస్టాఫీసు ద్వారా..

పోస్టాఫీసు నుండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పోస్టల్ ఇండియాతో కలిసి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. ఈ సేవ నవంబర్ 2020లో ప్రారంభించబడింది. ఈ సేవ పోస్ట్‌మ్యాన్ ద్వారా అందించబడుతుంది. ఈ విధంగా కూడా పెన్షన్లు మీ జీవన్‌ ప్రమాణ్‌ (లైఫ్‌ సర్టిఫికేట్‌)ను సమర్పించే సదుపాయాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!

Fake Facebook Account: మీ పేరుపై నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా..? ఇలా డిలీట్‌ చేయండి..!