Women Crew Brings Oxygen Express: సాధించాలన్న సంకల్పం ఉండాలి కానీ అన్నిరంగాల్లో రాణించవచ్చని మరోసారి నిరూపిస్తున్నారు అతివలు. తామేమీ తక్కువ కాము అంటూ మహిళలు అన్నింట అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ పనులకే పరిమితమైన మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణ వాయువును చేరవేస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిచి తమకు తిరుగలేదనిపించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే ఆ రైళ్లు వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అయా రాష్ట్రాలకు చేరవేశాయి. తాజాగా జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒకటి బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్‌కు చేరుకుంది.
అయితే, ఆ రైలులో మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డ్.. ఇలా అందరూ మహిళ ఉద్యోగులు కావడం విశేషం. వైట్‌ఫీల్డ్‌కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ జార్ఖండ్ నుంచి కర్ణాటకకు తీసుకువచ్చారు. ఆరు బోగీలతో రైలు బెంగుళూరు చేరుకుంది. భారతీయ రైల్వే శాఖ ఇప్పటి వరకు 13,319 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను.. 814 ట్యాంకర్లలో.. 208 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా సరఫరా చేసింది.
An all-women crew brings the 7th #OxygenExpress from Tatanagar to Bengaluru with 6 Containers carrying 120 MT Liquid Medical Oxygen.#IndiaFightsCorona
@PIBBengaluru @SWRRLY @PiyushGoyalOffc pic.twitter.com/UUwYsyqorN— PIB in Goa (@PIB_Panaji) May 22, 2021