
Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ మన పరిశీలనా శక్తిని, మనకున్న శ్రద్ధను పరీక్షించడానికి అద్భుతమైన మార్గం. ఇప్పుడు ఇంటర్నెట్‌ను కదిలిస్తున్న ఒక తాజా ఇల్యూషన్ అందరి మెదళ్లను పదును పెడుతోంది. గందరగోళంగా ఉన్న కేబుల్స్ మధ్య దాగి ఉన్న పామును కనుగొనమని ప్రేక్షకులను సవాలు చేస్తుంది. ఇది సులభంగా అనిపించినప్పటికీ, కేవలం 50 మందిలో ఒకరు మాత్రమే ఈ పామును త్వరగా గుర్తించగలరు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ చిత్రంలో, బూడిద, నలుపు మరియు తెలుపు రంగుల ఎలక్ట్రికల్ కేబుల్స్ చిక్కుబడి ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి మెలికలు తిరుగుతూ, గందరగోళంగా ఉండి, గీతలు, నీడలతో కూడిన ఒక సంక్లిష్టమైన నమూనాను సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఒక పాము తన శరీరం, రంగులతో పూర్తిగా కేబుల్స్‌లో కలిసిపోయి ఉంది.
పాము పొలుసులు బూడిద, నలుపు రంగుల మిశ్రమంలో ఉంది. ఇది కేబుల్స్, వాటి నీడలను పోలి ఉంటుంది. ఈ కారణంగా, సజీవంగా ఉన్న పామును, నిర్జీవ వస్తువులను వేరు చేసి చూడటం మన కళ్లకు చాలా కష్టమవుతుంది.
కొంతమంది పామును కొన్ని సెకన్లలోనే గుర్తించారు. మరికొందరు పామును గుర్తించడంలో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ గజిబిజి కేబుల్స్ మధ్య పామును గుర్తించాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే. మీరు ఇంకా పామును కనుగొనలేదా? బహుశా మళ్ళీ చూసే సమయం ఆసన్నమైందన్నమాట. మేం అందించిన ఫొటోలో పాము ఎక్కడుందో తెలుసుకుంటే, మీ కళ్ళు మొదటిసారి ఏమి మిస్ అయ్యాయో చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోవచ్చు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..