Puzzle: 15 సెకన్ల టైమ్.. ఆ లోపు ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీ ఐ ఫోకస్ అదుర్స్ అంతే..
కాగితపు పువ్వులతో నిండిన ఈ ఇంటి వద్ద ఒక పాము దాగి ఉంది. మీరు దానిని 15 సెకన్లలో కనుగొనగలరా?... ఈ టాస్క్ మీరు కంప్లీట్ చెయ్యగలరా..?

ఆప్టికల్ ఇల్యూజన్ అనేది మీ కంటి చూపు, పరిశీలన నైపుణ్యాలను సవాలు చేసే ఒక పజిల్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది నెటిజన్లు ఈ గేమ్‌కు ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటో పజిల్స్ నిత్యం వైరల్ అవుతున్నాయి. ఛాలెంజ్‌లు ఇష్టపడేవారిని ఇవి బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవి సాల్వ్ చేస్తే ఫుల్ కిక్ వస్తుంది. మనపై మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బుర్రకు కూసింత మేత వేసినట్లు అవుతుంది. మన కళ్ల ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇలాంటి క్రేజీ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ అందించేందుకు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పేజీలు తెగ పోటీ పడుతున్నాయి. అయితే ఇలాంటి కొన్ని ఈజీగా ఉన్నా.. మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయి. ఎంత వెతికినా దొరక్క.. మనల్ని ఇబ్బంది పెడతాయి. మరికొందరు ఆన్సర్ దొరికే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతూనే ఉంటారు. తాజాగా మీ ముందుకు అలాంటి పజిలే తీసుకొచ్చాం.
మీరు పైన ఫోటోను బాగా గమనించండి. ఎక్కడో పల్లెటూరి ఇల్లులా ఎంతో అందంగా ఉంది కదూ..! వాకిలిలో ఉన్న చెట్టుకు పూసిన కాగితం పూలు.. ఆ ఇంటి అందాన్ని డబుల్ చేశాయి. అయితే ఇక్కడే ఓ ప్రమాదరక పాము కూడా నక్కి ఉంది. దాన్ని కనిపెట్టడమే మీకు ఇప్పుడు పెద్ద టాస్క్. కొద్దిగా కష్టం అంతే. పరీక్ష పెట్టి చూస్తే దాన్ని సులభంగానే పసిగట్టవచ్చు. ఆ.. లైట్ అనుకుంటే మాత్రం అది అంత ఈజీగా దొరకదు.
ఆ పామును కనిపెట్టినవారు గ్రేట్ అంతే. ఎంత వెతికినా కనిపించలేదు అనుకునేవారు.. మున్ముందు విజయాలు సాధిస్తారు.. బాధపడకండి. ఆన్సర్ ఉన్న ఫోటో మేము దిగువన ఇస్తాం. కానీ మినిమం ఎఫర్ట్స్ పెట్టనివారు మాత్రం.. కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే.. ప్రయత్నం ఉంటే విజయాలు ఎప్పటికైనా దక్కుతాయి. అసలు ట్రై కూడా చేయకపోతే మాత్రం మనం ఎప్పటికీ విన్నర్స్ అవ్వలేం. అది పజిల్ అయినా.. గేమ్ అయినా.. లైఫ్ అయినా….!

Snake
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
