పతీ సహగమనం: అర్ధాంగి లేని జీవితాన్ని ఊహించుకోలేకోయాడు.. ఆమె చితిలోకి దూకి తనువు చాలించాడు

వివాహ బంధం ఎంతో అమూల్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలకట్టలేనిది. కష్టాలు ఎన్ని ఎదురైనా, కన్నీళ్లు పదే, పదే ఎదురొస్తున్నా.. భాగస్వామి తోడు ఉంటే.. ఎటువంటి సమస్యల....

పతీ సహగమనం: అర్ధాంగి లేని జీవితాన్ని ఊహించుకోలేకోయాడు.. ఆమె చితిలోకి దూకి తనువు చాలించాడు
Pyre

Updated on: Aug 26, 2021 | 1:37 PM

వివాహ బంధం ఎంతో అమూల్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలకట్టలేనిది. కష్టాలు ఎన్ని ఎదురైనా, కన్నీళ్లు పదే, పదే ఎదురొస్తున్నా.. భాగస్వామి తోడు ఉంటే.. ఎటువంటి సమస్యల సుడిగుండాలనైనా దాటవచ్చు. ముఖ్యంగా మహిళలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, అప్పటివరకు పెరిగిన ఇంటిని వదిలేసి.. మరో ఇంటికి వచ్చి నివశిస్తారు. అలానే మెట్టినింట అడుగుపెట్టిన తన భార్యను ఓ వ్యక్తి పెళ్లైన దగ్గర్నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆమె కూడా అతడిపై అంతే ప్రేమను కురిపించింది. అలానే ఏళ్లు గడిచాయి. వృద్దాప్యం వచ్చినా.. వారి ప్రేమ బంధంలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే  మృత్యువు మాత్రం వారి మధ్య దూరం పెంచాలని డిసైడయ్యింది. ఆమెను తనలో కలిపేసుకుంది. అయితే ఇన్నాళ్లు తోడున్న భార్య ఇక లేదన్న విషయాన్ని ఆ వృద్ధుడు తట్టుకోలేకపోయాడు. తన అర్ధాంగి లేదన్న విషయం జీర్ణించుకోలేక కాలుతున్న ఆమె చితిలో దూకేశాడు. గుండెల్ని మెలిపెట్టే  ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. రాయబారి (60), నీలమణి శబర(65) భార్యభర్తలు. రాయబారి మంగళవారం హార్ట్ ఎటాక్‌తో తనువు చాలించింది. నలుగురు కుమారులు, భర్త, గ్రామస్థులతో కలిసి గ్రామ శివారుల్లోని శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ చితి పేర్చి మృతదేహానికి నిప్పంటించి.. అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి పరుగున వెళ్లి చితి మంటల్లో దూకేశాడు. అందరూ చూస్తుండగానే ఒకే చితిలో భార్యాభర్తలు కాలిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Vizag: దండిగా సొమ్ములిస్తుంది అనుకుంటే.. సొమ్మసిల్లేలా చేస్తోన్న ట్యూనా చేప.. కేజీ రూ.50కే

Pawan Kalyan: ద పవర్.. ద స్టార్.. ద కింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ బోనంజా.. గెట్ రెడీ..!