మోటారు వాహన చట్టాల గురించి చాలా మందికి.. చాలా విషయాలు తెలియవు. అయితే.. తప్పనిసరిగా వాహనం నడిపేవారు అన్ని ట్రాఫిక్ నియమాలను పాటించాలి.. తెలుసుకోవాలి. ఇది రెండు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొదట సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. రెండవది పోలీసులు మీకు చలాన్ చేయరు. లేకపోతే, ట్రాఫిక్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు.. మీకు చలాన్ పడే అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు మాత్రమే జరిమానాతో సరిపెడుతారు.. అది కూడా దాటితే కోర్టు వరకు వెళ్తుంది. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీ చలాన్ పడకూడదని మీరు కోరుకుంటే.. అప్పుడు ట్రాఫిక్ నియమాలను అనుసరించడం తప్పనిసరి.. అంతే కాదు కొంత వరకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకొని ఉండాలి.
భారత ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి మరింత కఠినతరం చేస్తోంది. అదే అమలు కోసం 1989 మోటారు వాహన చట్టం, వాహన తయారీ మార్గదర్శకాలలో కూడా అనేక మార్పులు చేయబడ్డాయి. సిగ్నల్ జంపిగ్ నిబంధనలతోపాటు.. సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి సాధారణ నియమాలు ఇప్పుడు భారీ పెనాల్టీని వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, ఇవి రహదారిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన నియమాలు! మీరు తెలుసుకోవలసిన.. అంతగా తెలియని ట్రాఫిక్ నియమాలు చాలా ఉన్నాయి.
అయితే, చాలా మందికి తెలియని కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. తమకు అన్ని రూల్స్ తెలుసని అనుకుంటారు.. మొండిగా వాదిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నామని కూడా వారికి తెలియదు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలస్తుంది. ట్రాఫిక్ రూల్స్‌లోని కొన్ని మనకు తెలియని నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం..
చెప్పులు ధరించి ద్విచక్ర వాహనం నడపడం..
స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపకూడదనేది కూడా ట్రాఫిక్ రూల్స్‌లో నియమం. దీని గురించి కొద్ది మందికి మాత్రమే బహుశా తెలుసి ఉంటుంది. వాస్తవానికి ప్రస్తుతమున్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం స్లీపర్లు లేదా ‘చెప్పులు’ ధరించి ద్విచక్ర వాహనాలను నడపకూడదు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు పూర్తిగా మూసి ఉన్న బూట్లు ధరించడం అవసరం. అలా చేయని పక్షంలో రూ.1000 వరకు జరిమానా విధించవచ్చు.
దీనితో పాటు, బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు ప్యాంటు, షర్ట్ లేదా టీ-షర్ట్ ధరించడం కూడా తప్పనిసరి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధించవచ్చు. ఇది కాకుండా, సాధారణ నిబంధనల గురించి మాట్లాడినట్లయితే.. బైక్‌పై హెల్మెట్ ధరించకపోతే రూ. 1000 జరిమానా ఉంటుంది. అదే సమయంలో బైక్‌కు సంబంధించిన పత్రాలు లేకపోయినా వేల రూపాయల జరిమానా విధించవచ్చు. అయితే కొన్ని నిబంధనలు ఆయా రాష్ట్రాల్లో మారుతుండవచ్చు.
ఒక వ్యక్తి రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉన్నట్లు తేలితే.. ఆ వ్యక్తి జరిమానా చెల్లించవలసి ఉంటుంది. మీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మీ పాత డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఒకదానిని మీరు కలిగి ఉండవచ్చు. మీరు రెండు లైసెన్స్‌లను కలిగి ఉన్నట్లు తేలితే.. మీరు చేసిన నేరానికి సంబంధించి మీకు చలాన్ విధించబడుతుంది.
ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాల్లో దేనికైనా పాసేజ్ అందించడం ప్రతి పౌరుడి నైతిక బాధ్యత. కానీ ఎవరైనా అలాంటి వాహనానికి మార్గాన్ని ఇవ్వకపోవడం, అడ్డుకోవడం లేదా అడ్డగించడం జరిగితే వారు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అత్యవసర వాహనాల్లో అగ్నిమాపక దళం, అంబులెన్స్, పోలీసు వాహనం, ఇతరాలు ఉన్నాయి.
మరిన్న హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం