MALDIEVES : మాల్దీవుల్లో ఏం మజా ఉందో.. తారలకు ఎందుకంత మోజో! ఆ సిక్రేట్​ ఏంటో తెలుసుకోవాలని ఉందా..?

|

Feb 26, 2021 | 5:29 AM

MALDIEVES : మాల్దీవులు.. ఓ అందమైన చిన్న దేశం.. సినిమా తారల ఎడతెగని టూర్లతో ఈ మధ్య తెగ వార్తల్లో నిలుస్తోంది.. సోషల్​ మీడియాలో వాళ్ల ఫొటోలు

MALDIEVES : మాల్దీవుల్లో ఏం మజా ఉందో.. తారలకు ఎందుకంత మోజో! ఆ సిక్రేట్​ ఏంటో తెలుసుకోవాలని ఉందా..?
Follow us on

MALDIEVES : మాల్దీవులు.. ఓ అందమైన చిన్న దేశం.. సినిమా తారల ఎడతెగని టూర్లతో ఈ మధ్య తెగ వార్తల్లో నిలుస్తోంది.. సోషల్​ మీడియాలో వాళ్ల ఫొటోలు జోరుగా వైరల్​ అవుతున్నాయి.. యంగ్​ స్టర్లను గిలిగింతలు పెడుతున్నాయి. ప్రేమ జంటలు స్వేచ్ఛ విహారానికి.. కొత్త జంటలు హనీమూన్ ఆనందానికి.. సింగిల్ సెలబ్రిటీలు రీఫ్రెష్​ కోసం, బర్త్​ డే పార్టీల కోసం బుల్లి దేశానికి పయనమవుతున్నారు. ఓ నాలుగు రోజులు బిజీ లైఫ్​ నుంచి.. టెన్షన్​, స్ట్రెస్​ నుంచి రిలాక్స్​ అయ్యేందుకు జంటలతో పోలోమంటూ సముద్ర ద్వీపంలో వాలిపోతున్నారు.

‘‘కరోనా కాలంలో ఏమిటో ఈ సెలబ్రిటీల టూర్లు.. పైసలెక్కువయితే పైత్యం కూడా ఎక్కువవుతుంది..”అని జనాలు ముక్కునవేలేసుకుంటున్నారు. ఇక జనాలది ఇలా ఉంటే సినిమా స్టార్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు ఒకరిని చూసి మరొకరు ట్రిప్పులకు సిద్ధమైపోతున్నారు. కరోనాకు ముందే నాగార్జున తన భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి మాల్దీవులకు ఓ ట్రిప్పేశాడు. కరోనా కాలంలో కొంత గ్యాప్​ వచ్చినా.. ఇక వరుసగా మాల్దీవులకు వెళ్లే స్టార్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్త పెళ్లికూతుళ్లు కాజల్​, నిహారిక తమ భర్తలతో కలిసి హనీమూన్‌కి ఇక్కడికే వచ్చారు. కొత్త అనుభవాల రసస్వాదన చేసి తమ సంతోష చిత్రాలను పంచుకున్నారు.

ఢిల్లీ సుందరి తాప్సీ ఫొటో షూట్​ చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. అలాగే రకుల్ ప్రీతిసింగ్‌​ మాల్దీవుల సముద్ర బీచ్​ల్లో , సుందర రిసార్ట్​ల్లో .. యోగా, ఎక్సర్​సైజ్​లు చేస్తూ హాట్​ హాట్​ పిక్​లతో అలరించింది. మ్యారేజ్​డ్​ బేబీ ​సమంతా కూడా ఫొటోలతో కిక్కెక్కిచ్చింది. సూర్య , జ్యోతిక దంపతులు, కేజీఎఫ్​ స్టార్​ యష్​ దంపతులు కూడా తమ పిల్లలతో కలిసి వచ్చి సముద్ర అందాలలో ఓలలాడారు. యాంకర్​ శ్రీముఖి కూడా తన బ్యాచ్​ తో కలిసి అక్కడి రిసార్ట్​ల్లో రచ్చ రచ్చ చేసింది. తాజాగా మంచు మోహన్​ బాబు కూడా తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల అందాలను ఆస్వాదించారు. ఎందుకిలా.. సినిమా, టీవీ స్టార్లు మాల్దీవులకు క్యూ కడుతున్నారని ఆశ్చర్యం, అనుమానం కలుగక మానదు. అయితే ఓ బాలీవుడ్​ యాక్టర్​ ఆ సిక్రేట్​ ఓపెన్​ చేశాడు.

మాల్దీవులకు హాలిడే ట్రిప్పుకు రావాలంటూ తనకూ ఆహ్వానం వచ్చిందని, ఫ్లయిట్‍ ఖర్చులతో పాటు అక్కడున్నన్ని రోజులకు అవసరమయ్యే వసతులన్నీ తామే భరిస్తామంటూ పలు రిసార్టుల నుంచి పిలుపు వచ్చిందట. కాకపోతే అక్కడున్న టైమ్‍లో తమ రిసార్ట్​ను హైలెట్​ చేస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో అప్‍డేట్స్ ఇవ్వాలని అడిగారట. అయితే తాను వెళ్లలేదని చెప్పాడు. ప్రస్తుతం మాల్దీవుల్లోని రిసార్ట్​ ఓనర్లు ఆఫర్లు ఇస్తున్నారని, లేకుంటే ఫ్రీ ప్యాకేజీ కల్పిస్తున్నారని గుట్టు రట్టు చేశాడు. మాల్దీవులు దేశానికి ప్రధానంగా ఆదాయం వచ్చేది టూరిజంతోనే.. కరోనా వల్ల టూరిజం మీద ఆధార పడ్డ ప్రాంతాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి రిసార్ట్​ ఓనర్లు ఓ ప్లాన్​ వేశారు. భారతీయ తారలను ఆకర్షించి తద్వారా మిగతా జనాలను రాబట్టాలని చూస్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారనేది పక్కన పెడితే మాల్దీవులకు వెళ్లి తీరాలనే జనం మాత్రం బాగానే పెరిగారు. సినిమా స్టార్ల ప్రచారంతో.. బెస్ట్​ టూరిజం ప్లేస్​గా తమ దేశానికి, రిసార్ట్​లకు పేరు వస్తే కరోనా తగ్గిన తర్వాత లాభాలు రాబట్టుకోవచ్చని భావిస్తున్నారు.

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..