Monsoon Paint Care: వర్షాకాలంలో మీ ఇంటి పెయింట్‌ పెచ్చులుగా రాలిపోతోందా? ఇలా కాపాడుకోండి..

|

Jul 02, 2023 | 7:00 AM

వర్షాకాలంలో ఇంటి పెయింట్‌ను జాగ్రత్తగా చూసుకోవడం, దాని అందం, నాణ్యతను కాపాడుకోవడం చాలా అవసరం. వర్షాల కారణంగా, తేమ కారణంగా ఇంటి గోడలకు వేసిన పెయింట్‌ మొత్తం పెచ్చులుగా ఊడిపోతుంటుంది. అది ఇంటి అందాన్ని పాడు చేస్తుంది.

Monsoon Paint Care: వర్షాకాలంలో మీ ఇంటి పెయింట్‌ పెచ్చులుగా రాలిపోతోందా? ఇలా కాపాడుకోండి..
Paint
Follow us on

వర్షాకాలంలో ఇంటి పెయింట్‌ను జాగ్రత్తగా చూసుకోవడం, దాని అందం, నాణ్యతను కాపాడుకోవడం చాలా అవసరం. వర్షాల కారణంగా, తేమ కారణంగా ఇంటి గోడలకు వేసిన పెయింట్‌ మొత్తం పెచ్చులుగా ఊడిపోతుంటుంది. అది ఇంటి అందాన్ని పాడు చేస్తుంది. కళావిహీనంగా కనిపించేలా చేస్తుంది. మరి వర్షాకాలంలో ఇలా జరుగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే నిపుణుల కొన్ని సూచిస్తున్నారు. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

చెకింగ్/మరమ్మతు: వర్షాకాలం రాకముందే ఇంటి గోడలపై పెయింట్‌ను పరిశీలించాలి. పగుళ్లు, పొరలు లేవకుండా చూసుకోవాలి. నీటి తేమ లేకుండా జాగ్రత్తపడాలి.

ఉపరితలం పరిశుభ్రత: మురికి, దుమ్ము, ధూళిని తొలగించడానికి తేలికపాటి డిటర్జెంట్, నీటి ద్రావణాన్ని ఉపయోగించి పెయింట్ చేసిన ఉపరితలాలను శుభ్రం చేయాలి. ఇది అచ్చు, బూజు పెరుగుదలకు దారితీసే తేమను నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

టర్-రెసిస్టెంట్ సీలెంట్‌: తేమకు వ్యతిరేకంగా అదనపు రక్షణ పొరను అందించడానికి వాటర్-రెసిస్టెంట్ లక్షణాలతో వాటర్‌ప్రూఫ్ సీలెంట్ లేదా బాహ్య పెయింట్‌ను వేయాలి. ఇది పెయింట్‌కు నీరు వలన కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

మంచి వెంటిలేషన్: తేమ స్థాయిలను తగ్గించడానికి ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. మంచి గాలి ప్రవాహం పెయింట్ చేయబడిన ఉపరితలాలపై తేమను లాగేస్తుంది.

నీటి లీక్‌లకు చెక్ పెట్టాలి: గోడలు, పైకప్పు లేదా కిటికీలలో ఏదైనా నీటి లీకేజీ ఉంటే చెక్ చేసి, ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. తద్వారా పెయింటింగ్‌కు నష్టం ఉండదు.

రెగ్యులర్ క్లీనింగ్, మెయింటెనెన్స్: వర్షాకాలం మొత్తం, ఏదైనా మురికి లేదా మరకలను తొలగించడానికి మృదువైన గుడ్డ, స్పాంజ్‌ని ఉపయోగించి పెయింట్ చేసిన ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇది పెయింట్ రూపాన్ని కాపాడుతుంది.

అవసరమైన విధంగా పెయింట్ చేయాలి: నీటి తేమ కారణంగా పెయింట్ దెబ్బతిన్న ప్రదేశాలను గమనించినట్లయితే.. వెంటనే ఆ ప్రాంతాలలో పెయింట్ వేయాలి.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..