Alexa Saved Life: కోతి దాడి నుంచి ఇద్దరు చిన్నారులను ప్రాణాలు కాపాడిన అలెక్సా..!

|

Apr 06, 2024 | 2:01 PM

ఉత్తరప్రదేశ్‌లో సాంకేతిక పరిజ్ఞానంతో ఓ అమాయక బాలికల ప్రాణం కాపాడింది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత ఇలాంటి పని చేసి అందరినీ మన్నలు పొందింది. నికితా జ్ఞానం తన ప్రాణాలను, తనతో పాటు మరో 15నెలల అమాయకురాలి ప్రాణాలను కాపాడింది.

Alexa Saved Life: కోతి దాడి నుంచి ఇద్దరు చిన్నారులను ప్రాణాలు కాపాడిన అలెక్సా..!
Alexa Saved Life
Follow us on

త్తరప్రదేశ్‌లో సాంకేతిక పరిజ్ఞానంతో ఓ అమాయక బాలికల ప్రాణం కాపాడింది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో 13 ఏళ్ల నికిత ఇలాంటి పని చేసి అందరినీ మన్నలు పొందింది. నికితా జ్ఞానం తన ప్రాణాలను, తనతో పాటు మరో 15నెలల అమాయకురాలి ప్రాణాలను కాపాడింది. అంతేకాకుండా ఆధునిక పరికరాలను ఖచ్చితంగా ఉపయోగించడం ద్వారా ఎలాంటి సవాలునైనా అధిగమించవచ్చని నిరూపించింది. నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది.

ఆవాస్ వికాస్ కాలనీలోని పార్క్ సమీపంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది 13ఏళ్ళ నికిత. అక్కడే తన 15 నెలల మేనకోడలు వామికతో ఆడుకుంది. ఇద్దరూ మొదటి అంతస్తులో వంటగది దగ్గర సోఫాలో కూర్చున్నారు. ఇంట్లో మిగిలిన వారంతా ఇతర గదుల్లో ఉన్నారు. అంతలోనే ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది. వంట గదిలోకి వెళ్లి పాత్రలు, తినుబండారాలు ఏరుకుని విసరడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా కోతి తమ దగ్గర వచ్చి బీభత్సం సృష్టించడం చూసి బాలికలిద్దరూ భయపడ్డారు. 15 నెలల వామిక భయపడి తల్లి కోసం ఏడవడం ప్రారంభించింది. నికితా కూడా భయపడిపోయింది. కానీ అంతలోనే మెదడుకు పదును పెట్టింది.

కోతి వారిద్దరి వైపు పరుగెత్తుకు వచ్చి దాడి చేసేందుకు యత్నించింది. అప్పుడే నికిత కళ్ళు అక్కడే ఫ్రిజ్‌పై ఉంచిన అలెక్సా పరికరం వైపు వెళ్ళాయి. రెప్పపాటులో మెదడులో లైట్ స్విచ్ ఆన్ చేసినట్లు అనిపించింది. అలెక్సాకు కుక్క శబ్దం చేయమని అర్డర్ చేసింది. అలెక్సా వాయిస్ కమాండ్ అందుకున్న వెంటనే, అది కుక్కలా మొరిగే శబ్దాలు చేయడం ప్రారంభించింది. కుక్క మొరిగే శబ్దం విన్న కోతి, దెబ్బకు బాల్కనీ గుండా డాబా వైపు పారిపోయింది. అలెక్సాను ఇంత మంచి పద్ధతిలో ఉపయోగించుకోవచ్చని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు కుటుంబసభ్యులు. ఇలా పిల్లల ప్రాణాలను కాపాడినందుకు సంబరపడిపోయారు.

రోజువారీ దినచర్యను సులభతరం చేయడంలో అలెక్సా సహాయపడుతుంది. అలెక్సా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, అనుకూల పరికరాలను నియంత్రించడానికి వ్యక్తిగత వాయిస్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. ట్రాఫిక్ సమాచారం, కిరాణా జాబితాలను కూడా సృష్టించవచ్చు. సంగీతం వినడంలో సహాయపడవచ్చు. మీ కోసం వీడియో ప్లే చేయవచ్చు. మీరు గుడ్‌నైట్ చెబితే, అది గదిలోని లైట్లను స్విచ్ ఆఫ్ చేయగలదు. మీ కోరిక మేరకు మార్నింగ్ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న అలెక్సా పరికరం మన ఇంట్లో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదూ..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…