Megha Gas : తెలంగాణలో ఇక చౌకగా ఇంటి.. వాహన గ్యాస్‌.! పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ‘మేఘా’ సంస్థ

|

Apr 11, 2021 | 6:55 PM

MEGHA city gas station launched in Nalgonda : ఒకవైపు ఆకాశానికి అంటిన ఎల్పీజీ (LPG)సిలిండర్‌ ధరలు...

Megha Gas : తెలంగాణలో ఇక చౌకగా ఇంటి.. వాహన గ్యాస్‌.! పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌ను ప్రారంభించిన మేఘా సంస్థ
Mega 1
Follow us on

MEGHA city gas station launched in Nalgonda : ఒకవైపు ఆకాశానికి అంటిన ఎల్పీజీ  (LPG) సిలిండర్‌ ధరలు… మరోవైపు పెరుగుతోన్న పెట్రోల్‌ రేట్లతో మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి మధ్యతరగతి ప్రజలకు మేఘా సంస్థ ఊరటనిస్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తొలిసారిగా ‘మేఘా గ్యాస్‌’ పేరుతో తన సేవలను ప్రారంభించి మరో మైలు రాయిని సాధించింది.

కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు గ్యాస్‌ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన సీజీడీ CGD (సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌) ప్రాజెక్ట్ లో భాగంగా మేఘా ఇంజనీరింగ్‌ తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో గ్యాస్‌ పైప్‌ లైన్‌, సిటీ గేట్‌ స్టేషన్‌ పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు ‘ మేఘా గ్యాస్‌’ కింద గ్యాస్‌ సరఫరా సేవలను ప్రారంభించి చౌక ధరలకు అందించడం వినియోగదారులకు తీపివార్త.

సీజీడీ (CGD) – నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరాలో కీలకమైన ‘సిటీ గేట్‌ స్టేషన్‌’ CGS (సీజీఎస్‌) మదర్‌ స్టేషన్‌ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్‌ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ.

మేఘా ఇంజినీరింగ్‌, నల్గొండ ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్‌ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొని నల్గొండ జిల్లాలోని సిటీ గేట్‌ స్టేషన్‌ ద్వారా పీఎన్జీ PNG (పైప్డ్ నేచురల్‌ గ్యాస్‌) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్‌ స్టేషన్‌ ద్వారా సీఎన్జీ CNG (కంప్రెస్డ్ నేచురల్‌ గ్యాస్‌) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 కిలో మీటర్లు స్టీల్‌ పైప్‌ లైన్‌ వేయగా, మరో 80 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. 40 వేల కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా చేసే ఉద్దేశ్యంతో ఇంకా 500 కిలో మీటర్ల పొడవు గల ఎండీపీఈ (MPDE) పైప్‌ లైన్‌ నిర్మాణం చేపడుతోంది.

అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, చిట్యాల, నల్గొండ, నకిరేకల్‌, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట, ఇంకా.. కోదాడలలో 10 సీఎన్జీ (CNG) స్టేషన్లు నిర్మిస్తున్నారు. సీజీడీ (CGD) ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయడానికి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పైప్‌ లైన్‌ నిర్మాణం, ఇంకా  20 సీఎన్జీ (CNG) స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడం తోపాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్‌ గ్యాస్‌ CNG (సీఎన్జీ) ని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ ‘స్మార్ట్ – ఇట్స్ గుడ్‌ ‘ పేరుతో గ్యాస్ ను సరఫరా చేస్తోంది.

Read also : సాగర్‌లో ఉత్తమ్‌ – కోమటిరెడ్డి కంబైన్డ్ క్యాంపైన్‌.. జానా చలువతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారట. ఇదేంటి చెప్మా..!