Soul of India : హృదయాన్ని కదిలిస్తున్న ఫోటో.. నమ్ముకున్న రైలుకు నమస్కరించిన యువకుడు..

|

Feb 04, 2021 | 5:53 PM

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతాకాదు. ఈ పేరు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించింది. పేద ధనిక , చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా అందరిని భయబ్రాంతులకు...

Soul of India : హృదయాన్ని కదిలిస్తున్న ఫోటో.. నమ్ముకున్న రైలుకు నమస్కరించిన యువకుడు..
Follow us on

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ చిన్న పేరు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించింది.పేద- ధనిక , చిన్న-పెద్ద అనే తేడాలు లేకుండా అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. ఎంతోమంది కన్నీటి కారణం అయ్యింది. తిండి దొరక్క సొంత గ్రామాలకు వెళ్లలేక నరకాన్ని ప్రత్యక్షంగా చూశారు. ముఖ్యంగా పొట్టచేత పట్టుకొని పట్టణాలకు వచ్చిన వలస కార్మికుల వేదన వర్ణనాతీతం.. ప్రయాణ సదుపాయాలు లేక వందల కిలోమీటర్లు కాలినడకన సొంత గ్రామాలకు చేరుకున్నవారు కూడా ఉన్నారు. ఈ మహమ్మారి బారిన పడి లక్షల మంది ఆసుపత్రి పాలు కాగా.. వేలమంది మృత్యువాత పడ్డారు. ఇక కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ కుదేలైంది.. ప్రజా రవాణానే నమ్ముకున్నవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాననగరాల్లో లోకల్ రైళ్లు నిలిచిపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.

ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2020 మార్చి నుంచి రైళ్లు నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం.. దాంతో లక్షలమందికి జీవ‌నాధారమైన సర్వీసులు 11 నెలల పాటు దూరమైపోయాయి.ఆ సమయంలో ప్రజలు నరకం చూశారు. పనులన్నీ ఆగిపోయి పడరానిపాట్లు పడ్డారు. అయితే పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి రావడంతో ఈ నెల 1వ తేదీ నుంచి మ‌ళ్లీ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి రైళ్లు ప్రారంభం అవ్వడంతో ఓ యువకుడు భావోద్వేగానికి గురైయ్యాడు. మోకాళ్ళ పై కూర్చొని రైలుకు నమస్కరించాడు. ఇప్పుడు ఈ ఫోటో ప్రతిఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Farmers Protest: రోడ్లపై మేకులను తొలగించడం లేదు.. మరో చోటుకు మారుస్తున్నాం అంతే: ఢిల్లీ పోలీసులు