AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లను పాతిపెట్టి వెళ్లిపోయే పక్షి.. దీని గురించి ఆసక్తికర విషయాలు..

మాలియో పక్షి తన గుడ్లను భూమిలో పాతిపెట్టి, వెనక్కి చూడకుండా వెళ్లిపోతుంది. అగ్నిపర్వతాల దగ్గర ఉండే వేడి ఇసుకలో గుడ్లను దాచి, భూగర్భ వేడితో పొదిగే ఈ పక్షి తల మీది హెల్మెట్ ఇసుక ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్. సాధారణ కోడి గుడ్డు కంటే ఐదు రెట్లు పెద్దగా ఉండే ఈ గుడ్లు, పుట్టిన పిల్లలు ఒంటరిగా ఇసుకను తవ్వుకుంటూ భూమిపైకి వస్తాయి.

గుడ్లను పాతిపెట్టి వెళ్లిపోయే పక్షి.. దీని గురించి ఆసక్తికర విషయాలు..
Maleo Bird
Ram Naramaneni
|

Updated on: May 08, 2026 | 6:23 PM

Share

ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాలియో పక్షి జీవన విధానం. ఏ పక్షి అయినా గుడ్లను పొదగడానికి వాటిపై కూర్చుంటుంది. కానీ మాలియో పక్షి అందుకు పూర్తి భిన్నంగా తన గుడ్లను భూమిలో పాతిపెట్టి, వెనక్కి కూడా చూడకుండా వెళ్లిపోతుంది. ఈ అద్భుతమైన పక్షి అగ్నిపర్వతాల దగ్గర ఉండే వేడి ఇసుకలో తన గుడ్లను దాచిపెడుతుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే భూగర్భ వేడితోనే ఈ గుడ్లు పిల్లలుగా రూపాంతరం చెందుతాయి.

మాలియో పక్షి తల మీద ఉండే నల్లటి హెల్మెట్ ఒక హైటెక్ థర్మామీటర్‌గా పనిచేస్తుంది. ఇది ఇసుకలో ఎంత వేడి ఉందో పక్కాగా కొలవగలదు, తద్వారా గుడ్లకు సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. మాలియో పక్షి గుడ్డు ఒక సాధారణ కోడి గుడ్డు కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. పొదగబడిన తర్వాత, పిల్ల పక్షి రెండు రోజుల పాటు ఇసుకను తవ్వుకుంటూ, ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా భూమి పైకి రావాలి. అగ్నిపర్వతాల సహజ వేడితో ప్రాణం పోసుకుని, పుట్టిన వెంటనే స్వతంత్రంగా జీవన పోరాటం మొదలుపెట్టే ఈ మాలియో పక్షి నిజంగా ప్రకృతిలోని ఒక అద్భుతం.

ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పాము.. కట్లపాము, నాగుపాములను కూడా తినేస్తుంది.. 

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌