భారతదేశ రవాణా రంగంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. రోజూ లక్షలాది మందిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఉన్నప్పటికీ.. సుదూర ప్రయాణాలు సాగించే వారు మాత్రం రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రైలులో అనేక సౌకరయాలు ఉంటాయి. అయితే, ట్రైన్ ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో.. అంతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే.. ట్రైన్‌లో దోపిడిల బెడద ఎక్కువ. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ.. తోటి ప్రయాణికుల లగేజీని మాయం చేస్తారు దుండగులు. రైల్లో దోపిడీలపై నిత్యం కేసులు వస్తూనే ఉంటాయి. రైల్వే అధికారులు ఈ చోరీలను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. దుండగుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అయితే, మీ ట్రైన్ ట్రావెలింగ్ సమయంలో మీ వస్తువులు పోతే ఏం చేయాలనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇందుకో రైల్వే నిబంధన పరిష్కారం చూపుతుంది. ట్రైన్ ప్రయాణంలో మీ వస్తువులు చోరీకి గురైతే.. దొంగిలించబడిన వస్తువులకు పరిహారం చెల్లిస్తుంది రైల్వే శాఖ. మరి ఆ పరిహారం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
1. రైలులో ప్రయాణిస్తున్న సయమంలో మీ లగేజీని ఎవరైనా దొంగిలించినట్లయితే.. వెంటనే ఆ చోరీకి సంబంధించి రైల్వే పోలీసులకు(RPF)కి ఫిర్యాదు చేయాలి. మీకు సంబంధించి పోయిన వస్తువుల వివరాలన్నింటినీ ఆ ఫిర్యాదులో పేర్కొనాలి.
2. మీరు కోల్పోయిన సామాను 6 నెలల్లోగా అందకపోతే.. ప్రయాణ వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయాలి. పోయిన వస్తువులకు సంబంధించి పరిహారం పొందడానికి ఒక ఫామ్‌ని నింపాల్సి ఉంటుంది.
3. పోయిన వస్తువులకు సంబంధించిన దరఖాస్తు పెట్టుకున్న తరువాత మీ లగేజీని బట్టి రైల్వే శాఖ నుంచి పరిహారం అందుతుంది. అంటే, మీరు కోల్పోయిన వస్తువులకు సమానమైన డబ్బు మొత్తం ఇండియన్ రైల్వే పరిహారంగా అందజేస్తుంది.
4. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఈ పరిహారం అందజేస్తుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..