Kitchen Hacks: చెక్క వంట పాత్రలు మురికిగా ఉంటున్నాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయ్..!

ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇంటితో పాటు..వంట గదిని సైతం స్లైలీష్‌గా ఉంచుకుంటున్నారు. గృహోపకరణాలతో ఇంటినంతా సుందరీకరించినట్లుగానే.. వంటింట్లో వంట సామాగ్రిని కూడా క్లాస్‌గా సెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెరగడంతో..

Kitchen Hacks: చెక్క వంట పాత్రలు మురికిగా ఉంటున్నాయా? ఇలా చేస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయ్..!
Wooden Cookware

Updated on: May 29, 2023 | 5:12 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇంటితో పాటు..వంట గదిని సైతం స్లైలీష్‌గా ఉంచుకుంటున్నారు. గృహోపకరణాలతో ఇంటినంతా సుందరీకరించినట్లుగానే.. వంటింట్లో వంట సామాగ్రిని కూడా క్లాస్‌గా సెట్ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెరగడంతో.. అందరూ సహజ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. వంట గదిలో స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ప్లేస్‌లో మట్టి పాత్రలు, చెక్కతో చేసిన పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే, ఈ పాత్రలు చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. వాటిని శుభ్రం చేయడం అనేది పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల చెక్క పాత్రలు మురికిగా ఉంటాయి. అది అనారోగ్యానికి కారణం అవుతుంది. అయితే, ఈ చెక్క వంట పాత్రలను ఈజీగా శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ట్రై చేస్తే వంట పాత్రలు కొత్త వాటిలా నిఘనిగలాడుతాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉప్పు..

వంట సామాగ్రిని డిష్ లిక్విడ్‌తో కడిగిన తరువాత.. ఓ నిమ్మకాయను తీసుకుని, దానిపై ముతక ఉప్పు పోసి. కరిగిపోయే వరకు రుద్దాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా అవి త్వరగా క్లీన్ అవుతాయి.

నిమ్మరసం..

చెక్క వంట పాత్రలను ఓ బౌల్‌, జగ్గులో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొంత నిమ్మరసం కలపాలి. ఆ జగ్‌లో ఆ పాత్రలో నానబెట్టాలి. పాత్రలను 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా..

చెక్క వంటసామాను శుభ్రం చేయడానికి మరొక సులభమైన మార్గం.. బేకింగ్ సోడా. మరక ఉన్న ప్రదేశాలలో బేకింగ్ సోడాను, ఆ తరువాత నిమ్మరసం వేయాలి. కాసేపటి తరువాత మురికి ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. తరువాత మంచి నీటితో కడిగి ఆరబెట్టాలి. ఆ తరువాత వంట సామాగ్రికి కాస్త నూనె రుద్దాలి. ఇలా చేయడం వల్ల చెక్కతో చేసిన వంట సామాగ్రి ఎక్కువ కాలం వస్తుంది.

వెనిగర్‌లో నానబెట్టాలి..

మురికి మరకలు, దుర్వాసనను వదిలించుకోవడానికి వంటసామాగ్రిని వెనిగర్‌లో నానబెట్టాలి. చెక్క పాత్రలను వెనిగర్, నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని మంచినీటితో కడగాలి. ఆ తరువాత తడిని తుడవాలి.

పలుచటి ఇసుక కాగితం..

చెక్కతో తయారు చేసిన పాత్రలను శుభ్రం చేయడానికి ఇసుక అట్టను కూడా ఉపయోగించవచ్చు. ఇసుక అట్టతో రుద్దడం వల్ల మరకలు, బ్యాక్టీరియాతో నిండిన పైపొర తొలగిపోతుంది. చెక్ తాజాగా ఉండేలా చేస్తుంది.

వెచ్చని నీటిలో నానబెట్టాలి..

చెక్క పాత్రలను గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లో నానబెట్టాలి. తద్వారా వాటిని శుభ్రం చేయాలి. గోరువెచ్చని నీరు బ్యాక్టీరియాను చంపుతుంది. డిష్‌వాష్ వాసనను తొలగిస్తుంది. మసాలాలు, నూనె జిడ్డును కూడా శుభ్రం చేస్తుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..