Karnataka farmer is growing yellow watermelons : కర్ణాటకలోని ఒక రైతు పసుపు పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతున్నాడు. కలబుర్గిలోని కొరల్లి గ్రామానికి చెందిన బసవరాజ్ పాటిల్ అనే వ్యక్తి గ్రాడ్యూయేట్ పూర్తిచేశాడు. అతను తాను పండించిన పంటను నగరంలోని స్థానిక మార్ట్.. బిగ్ బజార్లలో అమ్మెవాడు. పాటిల్ శాస్త్రీయంగా పండించిన పసుపు పుచ్చకాయల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తున్నట్లు చెప్పుకోచ్చాడు. పుచ్చకాయల ఉత్పత్తికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటివరకు వాటిని అమ్మడం ద్వారా దాదాపు లక్ష రూపాయలను అందుకుంటున్నాడు. ఎర్ర పుచ్చకాయల కన్నా పసుపు పుచ్చకాయలు తీపి ఎక్కువగా ఉంటుందని పాటిల్ చెప్పుకోచ్చారు.
భారతదేశంలో పంట ఉత్పత్తిని రైతులు వైవిధ్యపరచాలని పాటిల్ అభిప్రాయం వ్యక్తపరిచాడు. పసుపు పుచ్చకాయలు ఎరుపు రంగులో ఉండేలా కలిసి ఉంటుంది. గతంలో గోవాకు చెందిన ఇంజినీర్ నుంచి రైతుగా మారిన ఓ వ్యక్తి కూడా ఇలాగే పసుపు పుచ్చకాయలను సేంద్రీయంగా పండించాడు. బోర్కర్ రసాయన ఎరువులు.. పురుగుల మందులను ఉపయోగించకుండా.. 250 పసుపు పుచ్చకాయలను సాగు చేశాడు. అతను తన వ్యవసాయ భూమిలో రూ.4000 పెట్టుబడి పెట్టి.. పుచ్చకాయల అమ్మకం ద్వారా దాదాపు రూ.30,000 కంటే ఎక్కువగా సంపాదించాడు. సిట్రల్లస్ లానాటస్ అనే శాస్త్రీయంగా పిలువబడే ఈ పుచ్చకాయలను ముందుగా ఆఫ్రికాలో పండించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1000 రకాలకు పైగా ఈ పంటను పండిస్తున్నారు. పసుపు పుచ్చకాయలు..
సాధరణంగా లేత పసుపుతోపాటు కొద్దిగా బంగారు రంగులో ఉంటాయి. ఇందులో కూడా మాములు పుచ్చకాయల్లో ఉండే గోధుమ నలుపు రంగు విత్తనాలు ఉంటాయి. ఎర్ర పుచ్చకాయలతో పోలిస్తే వీటికి థింకర్ రింగ్ కూడా ఉంటుంది. పసుపు పుచ్చకాయలలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపోందించడమే కాకుండా.. చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎర్ర పుచ్చకాయ మాదిరిగా కాకుండా.. పసుపు పుచ్చకాయలో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇది క్యాన్సర్, కంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
మీరు ఎక్కువగా జంక్ పుడ్ తింటున్నారా.. అయితే మీకు సంతాన భాగ్యం అంతంత మాత్రమే.. ఎందుకో తెలుసా..