Watch: రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. నిలిచిపోయిన రైలు.. వీడియో వైరల్

జార్ఖండ్‌లోని రాంఘర్ అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కనే ఓ ఏనుగు బిడ్డకు జన్మనిచ్చింది. సడెన్‌గా అదే ట్రాక్‌పై ట్రైన్ వచ్చింది. ఇది గమనించిన స్థానికులు రైలును ఆపాలని కోరారు. ఆ తర్వాత రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై కొద్దిసేపు రైళ్లను నిలిపేశారు.

Watch: రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం.. నిలిచిపోయిన రైలు.. వీడియో వైరల్
Elephant

Updated on: Jul 09, 2025 | 8:51 PM

జంతువులు అడ్డొచ్చిన్నప్పుడు రోడ్లపై వాహనాలు ఆగడం మామూలే. జంతువులు వెళ్లేదాకా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. అయితే రైళ్ల విషయంలో అలా ఉండదు. జంతువుల అడ్డొచ్చినా వాటి గుద్దుతూ ముందుకెళ్తుంటాయి. ఇప్పటికే రైళ్ల ప్రమాదంలో ఎన్నో జంతువులు మరణించాయి. అయితే తాజగా ఓ ఏనుగు కోసం ట్రైన్ రెండు గంటలు ఆగింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా  మారాయి. జార్ఖండ్‌లోని రాంఘర్ అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ ఏనుగు ప్రసవవేదనతో బాధపడింది. చివరకు ట్రాక్ దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. సడెన్‌గా అదే ట్రాక్‌పై ట్రైన్ వచ్చింది. ఇది గమనించిన స్థానికులు రైలును ఆపాలని కోరారు. ఆ తర్వాత రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై కొద్దిసేపు రైళ్లను నిలిపేశారు.

ప్రసవం తర్వాత ఏనుగు అక్కడి నుంచి వెళ్లడానికి చాలా కష్టపడింది. రైల్వే ట్రాక్ పక్కనే చిన్న కాలువ ఉండగా.. ఏనుగు దాన్ని దాటడానికి ఇబ్బంది పడింది. సుమారు 2 గంటల తర్వాత తన బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైల్వే అధికారులను ప్రశంసించారు. చాలా ఓపితో రెండు గంటల పాటు ఉన్న రైలు సిబ్బందితో పాటు ప్రజలను మెచ్చుకున్నారు. ఇటువంటి ఘటనలు చూడటం సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అస్సాంలోనూ ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌లో తన గుంపు నుండి విడిపోయిన రెండు నెలల ఏనుగు పిల్ల రోడ్లపైకి వచ్చింది. ఈ క్రమంలో స్థానిక వెటర్నరీ డాక్టర్ తన టీమ్‌తో కలిసి పిల్ల ఏనుగును తిరిగి తన తల్లి వద్దకు చేర్చారు. ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..