భోజనం చేసిన తర్వాత చాలా మంది చేతులను తిన్న కంచంలోనే కడుక్కోవడం సాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అయితే తిన్న ప్లేట్‌లో కాకుండా వేరేగా కడుక్కంటారు. కాని తిన్న కంచంలోనే చేతులు కడుక్కోవాలని చాలా మంది చెబుతుంటారు. కాని జోతిష్య శాస్త్రం ప్రకారం తిన్న కంచంలో చేతులు కడగడం మంచిది కాదంటున్నారు జోతిష్య పండితులు. దరిద్ర దేవత అనుగ్రహం కోరుకునే వారే అలా చేస్తారంటున్నారు. ఐశ్వర్యవంతులుగా ఉండి, తమ సంపద అంతా పోయి.. తాము దారిద్ర్యాన్ని అనుభవించాలనుకునేవారు మాత్రమే తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడుక్కుంటారని చెబుతున్నారు. భోజనం తినేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అన్నం తినే సమయంలో ఒళ్లో కంచం పెట్టుకుని భోజనం చేయడం, తింటూ తింటూ ఎంగిలి చేతితో పాత్రలు పట్టుకుని వడ్డించుకోవడం, ఇళ్లంతా ఎంగిలి మెతుకులు చల్లడం, తిన్న ప్రాంతంలో నీళ్లు చల్లి శుద్ధి చేయకపోవడం
వంటివి దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ అని చూసిస్తున్నారు. ఆ స్థానాల్లో దరిద్ర దేవతలు ఉంటారని, వారి అనుగ్రహం కోరుకునేవారు మాత్రమే అలా చేస్తారంటున్నారు పండితులు. దరిద్ర దేవతల అనుగ్రహం వద్దు, తమకు లక్ష్మి కటాక్షం కావాలనుకునేవారు ఇళ్లు శుభ్రంగా ఉంచుకుని, తినేటప్పుడు చాలా శుభ్రతను పాటిస్తారంటున్నారు.
భోజనం చేసే సమయంలో ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవాలని, కంచం చుట్టూ మెతుకులు పడవేయకూడదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రజ్ఞలు. భోజనం చేసేటప్పుడు కంచంలో అన్నం ఉంచకూడదని, పూర్తిగా శుభ్రంగా కంచంలో ఒక మెతుకు కూడా లేకుండా అన్నం తినాంటున్నారు. తినే సమయంలో అరచేతిని దాటి వెళ్లకూడదని, వేళ్లు చివరిలో నాకకూడదని చెబుతున్నారు. తిన్న తర్వాత వేళ్లు నాకడం కూడా దరిద్ర దేవత స్థానం అని అంటున్నారు జోతిష్య పండితులు.
సాధారణంగా సుఖాలు మరిగేటప్పుడు కొన్ని అలవాట్లు చేసుకుంటారని, కొంతమంది నడుస్తే తినడం, మరికొంతమంది ఒళ్లో కంచం పెట్టుకుని భోజనం చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదంటున్నారు నిపుణులు. తినే భోజనం అన్నపూర్ణదేవితో సమానమని, భోజనం తిన్న తర్వాత అన్నపూర్ణ దేవత మొహన్న చేయి కడగకూడదని చెబుతున్నారు. నియమబద్దంగా ఎవరైతే భోజనం చేస్తున్నారో వారికి జీవితంలో ఎప్పుడూ భోజనానికి ఇబ్బంది ఉండదంటున్నారు. భోజనం చేసే విధానంలో మనిషి ఎలాంటివాడో తెలిసిపోతుందంటున్నారు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అందరితో కూర్చుని తింటున్నప్పుడు అందరూ తినడం మొదలుపెట్టే వరకు ఆగాలని, తిన్న తర్వాత చివరి వారు తినేవరకు కూడా ఆగాలని సూచిస్తున్నారు. ముందుగా లెగిస్తే సభా మర్యాద పాటించినట్లఉ కాదంటున్నారు. భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కంచంలో చేయి కడగకూడదని జోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చూడండి..