Job: వారానికి మూడు రోజుల పనిదినాలు సాధ్యమేనా.? బిల్‌గేట్స్‌ సమాధానం ఇదే..

|

Nov 25, 2023 | 12:23 PM

ఇదిలా ఉంటే తాజాగా వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే పని దినాలు అనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తుండగా. ఇప్పుడుఏకంగా నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలనే వాదన వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగాఇదే విషయమై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా వారానికి మూడు...

Job: వారానికి మూడు రోజుల పనిదినాలు సాధ్యమేనా.? బిల్‌గేట్స్‌ సమాధానం ఇదే..
Bill Gates
Follow us on

వర్క్‌ కల్చర్‌లో సమూల మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వారానికి కేవలం ఒక రోజు మాత్రమే సెలవు దినంగా ఉండేది. కానీ ఐటీ విప్లవం తర్వాత ఉద్యోగులు వారానికి రెండు రోజులు సెలవులు పొందుతున్నారు. వారానికి రెండు సెలవులు కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా బ్యాంకింగ్‌, బీపీఓ వంటి రంగాల్లోనూ విస్తరించాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే పని దినాలు అనే ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తుండగా. ఇప్పుడుఏకంగా నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలనే వాదన వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగాఇదే విషయమై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా వారానికి మూడు పనిదినాలు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు.

దక్షిణాఫ్రికాకు చెందిన కమెడియన్‌, రచయిత ట్రేవొర్‌ నోహా నిర్వహించే ‘వాట్‌ నౌ’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మనుషులకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదన్న బిల్‌గేట్స్‌.. అలాగే ఈ టెక్నాలజీతో ఉద్యోగాల కోతలు కూడా ఉండవనున్నారు. కానీ.. పనితీరులో మాత్రం శాశ్వత మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో మనుషులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదని, ఆహారం, ఇతర పనులు రోబోలే చేస్తాయని తెలిపారు. ఈ కారణంతోనే వారానికి 3 రోజులే పనిచేసే సమాజాన్ని చూడొచ్చని, సంస్థలు, ఉద్యోగులు దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది’’ అని బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే గతంలో ఏఐపై పలు సందర్భాల్లో మాట్లాడిన బిల్‌ గేట్స్‌.. పారిశ్రామిక చూపినంత ప్రభావం, ఏఐ చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కంప్యూటర్లు తీసుకొచ్చిన మార్పు, ఏఐతో సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇక కృత్రిమ మేథాతో సమస్యలున్న మాట వాస్తవమేనని, అయితే మనం వాటిని మనం ఎదుర్కొగలమని బిల్‌గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..