Bay of Bengal – Cyclone: బంగాళాఖాతానికి, తుఫాన్‌కి మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి..? ఆసక్తికర విషయాలు మీకోసం..

బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టడం.. అది తుఫానుగా మారడం.. మనల్ని ముప్పుతిప్పలు పెట్టడం! మనం తరచూ వింటూ వస్తున్న మాట ఇది. వాయుగుండం పుట్టిందంటే అది బంగాళాఖాతంలోనే అని ఖరారైపోవడం మనకు అలవాటు. అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి.. బంగాళాఖాతమే తీవ్రమైన సైక్లోన్లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? ఇదొక ఇంట్రస్టింగ్ అంశం.

Bay of Bengal - Cyclone: బంగాళాఖాతానికి, తుఫాన్‌కి మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి..? ఆసక్తికర విషయాలు మీకోసం..
Bay Of Bengal

Updated on: Dec 06, 2023 | 8:10 PM

బంగాళాఖాతంలో వాయుగుండం పుట్టడం.. అది తుఫానుగా మారడం.. మనల్ని ముప్పుతిప్పలు పెట్టడం! మనం తరచూ వింటూ వస్తున్న మాట ఇది. వాయుగుండం పుట్టిందంటే అది బంగాళాఖాతంలోనే అని ఖరారైపోవడం మనకు అలవాటు. అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య ఉండే ఈ ఫెవికాల్ బంధం ఏంటి.. బంగాళాఖాతమే తీవ్రమైన సైక్లోన్లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? ఇదొక ఇంట్రస్టింగ్ అంశం.

1970లో వచ్చిన భోలా తుఫాను ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. 2008 మేలో బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫానుకు లక్షా 40 వేల మంది చనిపోయారు. నిన్నమొన్నటి మిచౌంగ్ దాకా… డేంజరస్ తుఫాన్లన్నీ పుట్టింది బంగాళాఖాతంలోనే. ఇవే కాదు.. ఇంతవరకూ సంభవించిన అత్యంత భీకరమైన 35 తుపానుల్లో 27 తుఫాన్లు బంగాళాఖాతంలోనే పుట్టాయి. ఇక్కడే ఎందుకు…? కారణాలు ఏమై ఉంటాయి..?

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తీరప్రాంతమున్న సముద్రం బంగాళాఖాతమే. 50 కోట్ల మందికి పైగా జనం బంగాళాఖాతం తీరంలోనే బతికేస్తున్నారు.

బంగాళాఖాతం లోతు తక్కువగా ఉంటుంది. తీరం ఒకవైపునకు వంగినట్టు పల్లంగా ఉంటుంది. తుపాను సమయంలో వీచే గాలులు నీటిని బలంగా ఒడ్డువైపునకు తోస్తాయి.. దాంతో అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుపాను తీరాన్ని తాకుతుంది.. ఇదీ పరిశోధకుల తేల్చిన విషయం.

బంగాళాఖాతం ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. తీవ్ర తుఫాన్లు ఇక్కడే సంభవించడానికి ఇది కూడా ఒక కారణమట.

లూసియానాలోని గల్ఫ్ తీర ప్రాంతానిక్కూడా ఇటువంటి స్వభావం ఉంటుంది కనుక.. అక్కడ సైతం తుపాన్లు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ.. అక్కడ జనజీవనం తక్కువగా ఉంటుంది కనుక.. ప్రాణనష్టం గురించి పెద్దగా బెంగ లేదు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లోనే కాదు.. ఏప్రిల్, మే నెల్లో కూడా బంగాళాఖాతం కేరాఫ్‌గా తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి. వీటికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణమన్నది స్పెషలిస్టుల మాట.

ఇటీవలి కాలంలో అరేబియా సముద్రం ఉపరితలంపై కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సైక్లోన్ల విషయంలో బంగాళాఖాతానికి పోటీకొస్తోందట. జర భద్రం మరి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..