కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయింది. కానీ ఈ ప్రభావం ఐటీ రంగానికి అంతగా నష్టాన్ని మిగల్చలేదు. వర్కఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు అంచనా వేస్తున్నాయి. లాక్ డౌన్ మసయంలో వర్చువల్ గా ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. అంతేకాకుండా చాలా మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. నూతన కంపెనీల్లోకి బదీలీలు జరిగాయి. తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్లో పోచారం క్యాంపస్ ను మరింత విస్తరించేందుకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు రాష్ట్రంలో 20 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది.
అంతేకాకుండా రాబోయే నిధులతో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ బ్లాకులు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం వంటి ఇతర సదుపాయాల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్ 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది ఇన్ఫోసిస్. హైదరాబాద్ శివారులోని ఘట్ కేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఉంది. తాజాగా ఇన్ఫోసిస్ చెప్పటన్నున్న పెట్టుబడులతో మరో నాలుగు ఐటీ డెవలప్ మెంట్ బ్లాకులను నిర్మించనుంది.ఇందులో ఒక్కో టవర్ 15 ఫోర్ల వరకు నిర్మించనున్నట్లుగా తెలిపింది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే జీహెచ్ఎంసీ పర్యావరణ అనుమతులు కోరినట్లుగా తెలుస్తోంది. ఇక పోచారం క్యాంపస్లో 22,430 మంది పనిచేస్తుండగా.. ఈ విస్తరణ ద్వారా 19,270 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. అంతేకాుకండా పరోక్షంగా మరిన్ని ఉద్యోగాలు అందించనుంది.
Also Read:
గోల్డ్ లోన్ తీసుకునేవారికి SBI బంపర్ ఆఫర్.. వారికోసం 2 లాభాలు అందుబాటులోకి.. ఎంటో తెలుసుకుందామా..