Train Ticket: మీరు రైలు టికెట్‌పై ఉండే W, A అక్షరాలను ఎప్పుడైనా గమనించారా? వాటి అర్ధం ఏంటో తెలుసా.?

|

May 28, 2022 | 12:18 PM

India Railways: ఆ కోడ్ పదాలలో, సీటు గురించి, రైలు గురించి, మీ సీట్ ఎక్కడ ఉంటుంది.. లాంటి సమాచారం దొరుకుతుంది...

Train Ticket: మీరు రైలు టికెట్‌పై ఉండే W, A అక్షరాలను ఎప్పుడైనా గమనించారా? వాటి అర్ధం ఏంటో తెలుసా.?
Railway
Follow us on

మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. రైలు టికెట్‌పై అనే కోడ్‌వర్డ్స్ ఉంటాయి.. వాటికి అర్ధం ఏంటో తెలుసా.? అవి మీ జర్నీకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఆ కోడ్ పదాలలో, సీటు గురించి, రైలు గురించి, మీ సీట్ ఎక్కడ ఉంటుంది.. లాంటి సమాచారం దొరుకుతుంది. మరి మీరెప్పుడైనా టికెట్‌పై W, A అనే పదాలను గమనించారా.? W అంటే విండో సీట్ అని అర్ధం.. మరి A అంటే ఏమిటి.? ఆ వివరాలు ఇలా…

ఉదాహరణకు, మీకు విండో సీట్ వస్తే.. దానిని సూచిస్తూ టికెట్‌పై W అనే పదం ఉంటుంది. అదేవిధంగా, సీట్ల విషయంలో అనేక కోడ్ పదాలు టికెట్‌పై ముద్రించబడి ఉంటాయి. ‘A’ గురించి మాట్లాడినట్లయితే, ఈ రకమైన సీటు కేవలం చైర్ కార్(Chair Car) ఉన్న రైలులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇలాంటి బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్ క్లాస్‌లు ఉండవు.

అంతేకాకుండా ఇలాంటి రకమైన సీట్లు డబుల్ డెక్కర్ రైళ్ళలో కూడా అందుబాటులో ఉంటాయి. ఆ చైర్ కార్ బోగీలో ఒక్కో వరుసలో ముగ్గురు పాసింజర్స్ కూర్చుంటారు. అందులోని విండో సీట్‌ను W, మిడిల్ సీట్‌ను M, చివరి సీట్‌ను A అని రైలు టికెట్‌లో పేర్కొంటారు. ఒకవేళ వరుసకు వచ్చి రెండు సీట్లు ఉన్నట్లయితే.. విండో సీట్‌ను W, దాని పక్క సీట్‌ను A అని అంటారు. ఇక స్లీపర్ క్లాస్ ట్రైన్స్‌లో బెర్త్స్ ఉంటాయి గనుక.. ఒకే వరుసలో ఉండే ఆరు సీట్లను ఒకటి లోయర్, మధ్యలోది మిడిల్, పైబెర్త్‌ను అప్పర్ అని అంటారు.. అలాగే సైడ్‌ను ఉండే బెర్త్స్‌ను సైడ్ లోయర్, సైడ్ అప్పర్ అని పేర్కొంటారు.