CA Results 2020: ఈరోజు సాయంత్రం ICAI, CA ఇంటర్మీడియట్, ఫౌండేషన్ ఫలితాలను విడుదల చేయనున్న ఐసీఏఐ..

|

Feb 08, 2021 | 2:29 PM

ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2020 ఫలితాలు ఈ రోజు సాయంత్రం విడుదల కానున్నాయి. గతేడాది

CA Results 2020: ఈరోజు సాయంత్రం ICAI, CA ఇంటర్మీడియట్, ఫౌండేషన్ ఫలితాలను విడుదల చేయనున్న ఐసీఏఐ..
Follow us on

ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2020 ఫలితాలు ఈ రోజు సాయంత్రం విడుదల కానున్నాయి. గతేడాది నవంబర్‏లో నిర్వహించిన సీఏ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మరియు ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఈరోజు సాయంత్రం వెబ్‏సైట్ icai.nic.in.‏లో చెక్ చేసుకోవచ్చని ఐసీఏఐ ప్రకటించింది.

ఒకవేళ సీఏ ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించకపోతే.. ఫిబ్రవరి 9న ప్రకటించనున్నట్లు ఐసీఏఐ స్పష్టం చేసింది. అభ్యర్థులు సీఏ ఫౌండేషన్ మరియు సీఏ ఇంటర్ ఫలితాలను ఐసీఏఐ icaiexam.icai.org మరియు icai.nic.in వెబ్ సైట్‏లలో చూడోచ్చని తెలిపింది. ఇందుకోసం ఐసీఏఐ హాల్ టికేట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పిన్ నంబర్లను ఉపయోగించి రిజల్ట్స్ చూసుకోవచ్చని తెలిపింది. 2020 నవంబర్లో సీఏ ఫౌండేషన్, ఇంటర్ ఫలితాలతోపాటు ఆల్ ఇండియా టాప్ 50 మెరిట్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.

రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి.
✤ ICAI, icai.org అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
✤ ఆ తర్వాత రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేసి, మీ కోర్సును ఎంచుకోవాలి.
✤ అందులో మీ రోల్ నంబరుతోపాటు, మీ icai, ca రిజిస్ట్రేషన్ నంబరును లేదా పిన్ నంబరును నమోదు చేయాలి.
✤ అనంతరం అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
✤ ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీ icai, ca రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 4.3 లక్షలకు పైగా రిజిస్టర్డ్ అభ్యర్థులకు సీఏ పరీక్ష నిర్వహించింది. ప్రభుత్వం జారీచేసిన కరోనా నిబంధనలను పాటిస్తూ.. దేశవ్యాప్తంగా 1085 పరీక్షా కేంద్రాల్లో నవంబర్ 21న పరీక్షను నిర్వహించింది.
ICAI, CA రిజల్ట్స్ ఈమెయిల్ ద్వారా..
అభ్యర్థులను విజ్ఞప్తుల మేరకు పరీక్షకు హజరైనవారి రిజల్ట్స్ ప్రకటించిన వెంటనే వెబ్ సైట్‏లో రిజిస్టర్ అయి ఉన్న ఈమెయిల్స్ చిరునామాలలో ఫలితాలు అందించబడతాయి.

2020 నవంబర్లో జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (ఓల్డ్ కోర్స్ మరియు న్యూకోర్స్) మరియు ఫౌండేషన్ ఎగ్జామినేషన్ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ పై మార్కులను తెలుసుకునేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పించింది. అభ్యర్థులు 57575కు మేసేజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫలితాలను పొందవచ్చు.

Also Read:

నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వేలో 2532 జాబ్స్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు..