
చూస్తుంటే, శీతాకాలం పూర్తైనట్టుగానే ఉంది. ఈ ఏడాది ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ సూచనలు చెబుతున్నాయి. ఇప్పటికే ACలకు సీజన్ వచ్చేసింది. అందువల్ల, మీ ఎయిర్ కండిషనర్‌ను వెంటనే సర్వీస్ చేయించుకోవడం చాలా ముఖ్యం. AC ని మంచి స్థితిలో ఉంచడానికి, సంవత్సరానికి కనీసం రెండుసార్లు సర్వీస్ చేయించుకోవడం చాలా అవసరం. లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీరే క్లీన్ చేసుకోవచ్చు. అవును, మీ AC ని మీరు ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లో AC ని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
ముందుగా పవర్ ఆఫ్ చేయండి. AC మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేసి ప్లగ్ తీసేయండి. భద్రత చాలా ముఖ్యం. ఇప్పుడు, ఫిల్టర్ తీసి శుభ్రం చేయండి. ఇండోర్ యూనిట్ కవర్ ఓపెన్ చేసి ఫిల్టర్ తీసుకోండి. ట్యాప్ నీటితో బాగా కడగండి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మళ్లీ ఫిక్స్ చేయండి. ఇండోర్ యూనిట్ క్లీనింగ్ తప్పనిసరి. సాఫ్ట్ బ్రష్ లేదా డ్రై క్లాత్‌తో లోపల ఉన్న డస్ట్ తుడవండి. అవసరమైతే AC క్లీనింగ్ స్ప్రే ఉపయోగించవచ్చు. అవుట్‌డోర్ యూనిట్ కూడా శుభ్రం చేయండి.
బయట యూనిట్ మీద ఉన్న దుమ్ము పూర్తిగా తొలగించండి. లైట్ వాటర్ స్ప్రే ఉపయోగించండి. నెలకు ఒకసారి శుభ్రం చేసుకోండి. ఫిల్టర్‌ను ప్రతి 30 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తే కూలింగ్ బాగా వస్తుంది. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఎక్కువ మురికి ఉంటే ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకోవడం మంచిది. వర్షాకాలం ముందు AC పూర్తి సర్వీస్ చేయించండి. వెనిగర్, నీరు మిశ్రమంతో ఫిల్టర్ శుభ్రం చేస్తే దుర్వాసన తగ్గుతుంది. వాక్యూమ్ క్లీనర్ వాడకంతో కూడా మీరు మీ AC మెష్ తో పాటు నెట్ ని శుభ్రం చేసుకోవచ్చు. ఇది దుమ్ము , ధూళిని ఇంకా బాగా తొలగిస్తుంది.
ఏసీని శుభ్రం చేయటంలో మరో ముఖ్యమైన పని ఏసీ డ్రెయిన్ పైపులను కూడా తరుచూగా శుభ్రం చేస్తూ ఉండాలి. ఎందుకంటే..డ్రెయిన్ పైపులు శుభ్రంగా లేనట్లయితే ఏసీలో నుంచి మనకు స్వచ్ఛమైన గాలి రాదు. ఇలాగే మనం చూడకుండా పట్టించుకోకుండా ఎయిర్ కండిషనర్ నడిపించడం వలన ఎయిర్ కండిషనర్ సామర్థ్యం దెబ్బ తింటుంది. దీంతో అది త్వరగా పాడవుతుంది. మీ AC ని శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే, టెక్నీషియన్‌ను సంప్రదించండి. శుభ్రం చేయడానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించవద్దు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..