AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఉప్ప.. పప్పు నుంచి మొదలు.. మసాలా దినుసుల్లో జరిగే ‘కల్తీ’ని కనిపెట్టండిలా..

Check Adulteration In Spices: కల్తీకి కాదేదీ అనర్హం అన్నాడో కవి. ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం మార్కెట్లో లభించే అన్ని నిత్యావసర వస్తువులు కల్తీ..కల్తీ. పాలు, నీళ్లు, కారం, ఉప్పు, పసుపు, మసాలా దినుసులు మొదలు.. ఇలా మార్కెట్లో..

Kitchen Hacks: ఉప్ప.. పప్పు నుంచి మొదలు.. మసాలా దినుసుల్లో జరిగే 'కల్తీ'ని కనిపెట్టండిలా..
Spices
Sanjay Kasula
|

Updated on: Aug 16, 2022 | 7:39 PM

Share

కల్తీకి కాదేదీ అనర్హం అన్నాడో కవి. ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం మార్కెట్లో లభించే అన్ని నిత్యావసర వస్తువులు కల్తీ..కల్తీ. పాలు, నీళ్లు, కారం, ఉప్పు, పసుపు, మసాలా దినుసులు మొదలు.. ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నింటిని కల్తీ చేస్తున్నారు మార్కెట్ కల్తీగాళ్లు. అన్ని మసాలా దినుసులను సరైన పరిమాణంలో చేర్చినప్పటికీ, మనం అనుకున్నట్లుగా ఆహారంలో రుచి రాదు. దీనికి కల్తీ మసాలాల వాడకం ఒక కారణం. సుగంధ ద్రవ్యాలు వాటి నూనె ద్వారా గుర్తించబడతాయి. కానీ చాలా సార్లు, నాసిరకం టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ప్రాసెసింగ్ సమయంలో సుగంధ ద్రవ్యాల సహజత్వంను కోల్పోతాయి. అటువంటి సమయంలో వాటి వాసన, పరిమాణాన్ని పెంచడానికి, వాటి రంగు, ఆకృతిని పోలి ఉండే వస్తువులు కల్తీ చేస్తుంటారు. ఉదాహరణకు, ఎర్ర మిరపకాయలో ఎర్ర ఇటుక పొడి లేదా డిటర్జెంట్ కలుపుతారు. ఎండిన బొప్పాయి గింజలను కూడా ఎండుమిర్చిలో కలుపుతారు.

ఈ సులభమైన మార్గాలతో కల్తీని గుర్తించండి

ఇవి కూడా చదవండి
  • దాల్చిన చెక్క : తరచుగా దాల్చిన చెక్క పేరుతో చైనీస్ కాసియాను విక్రయిస్తారు. రెండూ ఒకేలా ఉంటాయి. కానీ నిజమైన దాల్చినచెక్క సువాసన చాలా బాగుంటుంది. తాకడానికి సన్నగా ఉంటుంది. మరోవైపు, కాసియా కరుకుగా.. తాకడానికి మందంగా ఉంటుంది. దీని సువాసన కూడా చాలా తక్కువ. దాల్చిన చెక్క పొడిపై అయోడిన్ చుక్క వేయండి. పౌడర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం.
  • పసుపు : సింథటిక్ రంగులు, చాక్ పౌడర్లు, రంగులు లేదా రసాయనాలు పసుపుకు కలుపుతారు. వాటిని పరీక్షించడానికి.. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని, దానికి ఒక చెంచా పసుపు జోడించండి. పసుపు కరిగి ముదురు పసుపు రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. స్వచ్ఛమైన పసుపు నీటిలో కరిగిన వెంటనే లేత రంగులో కనిపిస్తుంది. అదే స్వచ్ఛమైన పసుపు అయినట్లైతే.. పసుపంతా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.
  • ఎర్ర మిరప పొడి : కృత్రిమ రంగు, సింథటిక్ డై, డిటర్జెంట్, ఇటుక పొడి, టాల్క్ మొదలైనవి ఎర్ర మిరపకాయకు కలుపుతారు. దాని స్వచ్ఛతను తనిఖీ చేయడానికి, ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఎర్ర మిరప పొడిని వేయండి. కల్తీ అయితే వెంటనే నీటి రంగు మారిపోతుంది. మీకు కావాలంటే, మీ చేతిలో కొన్ని ఎర్ర కారం తీసుకుని దానిపై కొన్ని నీటి చుక్కలు వేసి, ఆ పొడిని అరచేతిపై రుద్దండి. అందులో డిటర్జెంట్ మిశ్రమం ఉంటే చేతిలో నురుగు కనిపిస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం