ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేయటం ఎలా?

ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు ఐడి కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. భారత ఎన్నికల కమిషన్ 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు ఆన్‌లైన్ ఓటరు నమోదును అందిస్తుంది. ఒక భారతీయ పౌరుడు తనను సాధారణ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు మరియు ఫారం 6 ను ఆన్‌లైన్‌లో జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌లో నింపవచ్చు. మీరు భారతదేశంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే 1. భారతీయ పౌరులయి ఉండాలి. 2. క్వాలిఫైయింగ్ తేదీన 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. […]

ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేయటం ఎలా?

Edited By:

Updated on: Nov 21, 2019 | 4:29 PM

ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు ఐడి కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. భారత ఎన్నికల కమిషన్ 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులకు ఆన్‌లైన్ ఓటరు నమోదును అందిస్తుంది. ఒక భారతీయ పౌరుడు తనను సాధారణ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు మరియు ఫారం 6 ను ఆన్‌లైన్‌లో జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌లో నింపవచ్చు.

మీరు భారతదేశంలో ఓటరుగా నమోదు చేసుకోవాలంటే

1. భారతీయ పౌరులయి ఉండాలి.

2. క్వాలిఫైయింగ్ తేదీన 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

3. మీరు నమోదు చేయదలిచిన నియోజకవర్గం యొక్క పార్ట్ / పోలింగ్ ప్రాంతంలో నివసిస్తుండాలి.

4. ఓటర్‌గా నమోదు కావడానికి అనర్హులు కాదు.

మీరు పై ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి nvsp.in ని సందర్శించండి.

ఒకవేళ మీరు ఇంతకుముందు ఓటు నమోదు చేసుకుంటే, ఈ క్రింది లింక్‌పై వెళ్లడం ద్వారా మీరు దాన్ని ధృవీకరించవచ్చు!

మీరు ఓటు నమోదు చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి https://electoralsearch.in/ ని సందర్శించండి. జాబితాలో మీ పేరు కనిపిస్తే, మీరు ఓటు వేయడానికి అర్హులు, లేకపోతే, మీరు ఓటు నమోదు చేసుకోవాలి. ఓటరు నమోదు కోసం https://www.nvsp.in/ ని సందర్శించండి.