
ఓ యథార్ధ సంఘటన చెప్పుకోవాలిక్కడ. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక. ఇంటిపక్కన యువకుడితో పరిచయం. ఆ వయసులో కలిగే దాన్ని ప్రేమ అంటారని ఇప్పటి దాకా ఎవరూ పేరు పెట్టలేదసలు. ఆ బాలిక మాత్రం ప్రేమ అనే అనుకుంది. ఆ బంధానికి ఎంత బానిస అయిందంటే.. 8వ తరగతికే ఇంట్లో వాళ్లను ఎదురించి పెళ్లి చేస్తారా లేదా అని గొడవపడింది. ఆ యువకుడి తల్లిదండ్రులు ఒక మెట్టు దిగి.. ‘పోనీలేండి ఇష్టపడ్డారు కదా పెళ్లి చేద్దాం’ అని ఓ ప్రతిపాదన తెచ్చారు. ఆ తల్లిదండ్రులను కాస్త పక్కకు తీసుకెళ్లిన బాలిక పేరెంట్స్.. ‘సరే పెళ్లి చేయడానికి మేం రెడీనే.. కాని పిల్ల కనీసం వయసుకు రావాలి కదా’ అని పద్దతిగా చెప్పారు. యువకుడి తల్లిదండ్రులు కామ్‌గా వెళ్లిపోయారు. అప్పుడీ బాలిక… తన ప్రేమనే చిదిమేస్తారా అని వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మరో సంఘటన.. గుజరాత్‌లో ఓ పదేళ్ల బాలిక, 16ఏళ్ల బాలుడు.. ఇద్దరూ కలిసి పారిపోయారు. ఏంటంటే… ఇన్‌స్టాలో ప్రేమించుకున్నారట. హైదరాబాద్ అల్వాల్‌లోనూ ఇంతే. ఇద్దరు బాలికలు ఇద్దరు యువకుల ట్రాప్‌లో పడ్డారు. వాళ్లు ప్రేమ అనేసరికి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. సీసీటీవీల సాయంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈసీఐఎల్ లాడ్జ్‌లో దొరికారు. లేటెస్ట్‌గా.. 10వ క్లాస్ బాలిక కన్నతల్లినే సుత్తితో కొట్టి చంపేసింది. కారణం… ఈ వయసులో ప్రేమేంటని అదుపులో పెట్టే ప్రయత్నం చేసినందుకు. ఏంటి.. పెంపకంలో లోపమా… పిల్లలను పేరెంట్స్ అర్థం...